కావ్య నాయిక

కావ్య నాయిక

అలరించే అభినయం
ఆమె సొంతం
తళ తళ లాడే సౌందర్యం
ఆమె సొంతం
ప్రదర్శించే పటిమ ఆమెసొంతం
జీవంపోసే పాత్రలో
ఆమె సొంతం
నవరస భరిత నటన
ఆమె సొంతం
కదిలించే దృశ్యాల రూపం
ఆమె సొంతం
తలపించే కథాంశం
ఆమె సొంతం
కథ లోని కల్పిత అభినయం
ఆమె సొంతం
రక్తి కట్టే సన్నివేశాలు
ఆమె సొంతం
నడేసొచ్చే నాయికలో
ఇమిడేది ఆమె సొంతం
అందరి కంటికి ఆస్వాదించే
నటన ఆమె సొంతం
సన్నివేశాల సమాహారం
ఆమె సొంతం
వీనుల విందైన సంగీతం
ఆమె సొంతం
అభిమానించేఅభిమానుల
పరిపూర్ణ నాయిక
హోయాలోలికించే అందాలు
ఆమె సొంతం
చమత్కారాల హాస్యాలు
ఆమె సొంతం
పరిచయాలు లేని
పాత్రలో ఒడిగే కళ
ఆమె సొంతం
రంగుల ప్రపంచంలో
అంతులేని అభిమానుల
వెండితెర ల అభినేత్రి
కావ్య నాయిక

– జి జయ

Related Posts