కళ

కళ

బాపుగీసిన చిత్రం

చతుష్షష్టి కళల్లో చిత్రకళ
ఒక అద్భుత కళ

కుంచె జాలువారితే
కళ్ళు కదలాడుతోంది
అన్నట్టు చిత్రం కట్టిపడేస్తుంది
అదే బాపు గీసిన బొమ్మ
తెలుగు చిత్రాల వెలుగు
జిలుగులు
అద్భుత కళఖండాలు
ఆయన సొంతం
అచ్చ తెలుగు అందాలు
బుడుగుల అల్లరి బొమ్మలు
మనసు పలికే మధుర భావనల చిత్రాలు
చిరునవ్వుల దీపాలు
నాజూకు ల నాట్యాలు
ముద్దుగుమ్మల సొగసు
విచిత్రమైన మిత్రులు
భావ వ్యక్తీకరణ మంత్రం
అపురూప చిత్ర ఆవిష్కరణలు
రామాయణ గాథలు
ఊహా లోకాల్లో విహరించే
క్రీగంటి చతురతలు
తెరమీదకు తెస్తే
చిత్రకారుని పాత్రలు
మనముందు మాట్లాడే
ప్రాణం పోసిన జీవ
కళా కావ్యాలుగావెలుగుతున్న వి
వర్ణాలు నిండిన వసంతాలుగామిగిలి
వున్నాయి మనకోసం ……

– జి జయ

Related Posts