కళాశాల రోజులు

కళాశాల రోజులు

కళాశాల రోజులు కాదా ఎప్పటికీ మర్చిపోలేని
తీపి గురుతులు
బంగారంలాంటి భవిష్యత్తు
రెక్కలు తొడిగిన యవ్వనం
రంగు రంగుల ప్రపంచం
స్నేహ బంధాల చిత్రాలు
స్వేచ్ఛా శక్తుల లెక్కలు
సంతోషపు నేస్తాలు
ఊహల లోకాలఉయ్యాలలు
గడబిడ చేసే పాఠాలు
తియ్యని అల్లరి చేష్టలు
ఆశల పల్లకిలో పాటలు
ఆట పాటల సందడులు
సరదాల చిరునవ్వులు
కొత్త అనుభవ సాహసాలు
ఖర్చుకు సరిపోని డబ్బులు
అమ్మానాన్నలకుచెప్పే
అబద్ధాలు
చిలిపి కలహాల కారణాలు
శక్తి యుక్తుల బేరీజు లు
గైరుహాజరు గ్రూపులు
దాచే మాటలు
దారహాసపునవ్వులు
మంచిచెడుల కు తేడా
తెలియనిహృదయాలు
చదవడానికి పుస్తకాలు
కాని వినని మస్తకాలు
గురువుల మాటలు సరిపోవు
వెళ్ళే దారులు వెదుకుతూ
అర్థంకాని అవగాహనలు
మైలురాళ్ళ రహదారిలో
మరచిపోలేనిఅనుభూతుల
మళ్లీ రమ్మన్నా రాని
కళాశాల రోజులు కావు అవి
జీవితపు జ్ఞాపకాల కట్టలు……

– జి జయ

Related Posts