కలగంటి

కలగంటి

నీ కోసం ఎదురు చూసే నా కళ్ళు కలగంటున్నయి..
నీతో జీవితాంతం సంతోషంగా ఉండాలని..
నీకై వేసే నా ప్రతి అడుగు.. నీతో ఏడడుగులు వేయాలని కలగంటున్నాయి…
నీకోసం, నీ జత కోసం వేచి చూస్తూ ఆకాశం లోని చంద్రుడిని నేల మీద ఎప్పుడు చూస్తానా…

నా చేయి పట్టుకునే రారాజు ఎప్పుడూ వస్తాడా అని నా మనసు ఉప్పెనలా ఉవ్వెత్తున ఎగసి పడుతూ వేయి కళ్ళతో నా కనులు కలగంటున్నాయీ..

ఎక్కడ ఉన్నావు ప్రియతమా..

ఎప్పుడూ వస్తావు నా దరికి..

నేస్తమా..

నా కలలను ఎప్పుడు నిజం చేస్తావు…

నా ప్రాణమా…

– వనిత రెడ్డీ

Related Posts