కలగంటి

కలగంటి

అవును ఆమెతో ఆమె
కలగనింది నిజమే
ఆమెకు ఆమె మాత్రమే తెల్సు
ఇపుడు నువ్వు తెల్సు
తనలో నీతో బ్రతకడం తెల్సు
కొన్ని చీకట్లు తనని చుట్టేసినప్పుడు
నీలో వెలుగుని చూసిందేమో
అది ఆమెకు సంతోషం.. కానీ
కాలం కదా కరిగిపోతుంది కొవ్వొత్తిలా
ఏ దారి కనిపించదు ఒక్కోసారి
అడుగు అదుపు తప్పి ఎక్కడో చిక్కుకుపోతుంది
అపుడు నిన్ను చూస్తే
ఆమెకు వెలుగు కనిపించదు
ఎందుకంటే ఎంత వెలుగైనా ఆరిపోతుంది కదా
ఆమె కూడా అంతే
చీకటిలో నడక అదే ఆమెకు తోడు కూడా
ఇది కలలాంటి నిజం…

– సీత

Related Posts