కలగంటిని

కలగంటిని

కలగంటిని

ఎవరికి కానరాని నా సుందరి అందమైన నవ్వును కలగంటిని….

కలగంటిని

తన కను రెప్పల కలయిక నడుమ
ఏ కన్నులు చూడని అందం కలగంటిని

కలగంటిని

ఓ కొత్త లోకాన్ని పరిచయం చేసిన తన మాటలలో కొంగొత్త అందం కలగంటిని

కలగంటిని

నిశి చీకట్లలో శశి వెలుగుల అందం తన నవ్వులలో కలగంటిని

శ్రీనివాస్

Related Posts