కలలు

కలలు

కంటున్నాయి కలలు నా కళ్ళు ..
నిన్ను చూడాలని…
నిన్ను చేరాలని…
నీ చేయి పట్టాలని…
నీ జత లో నడవాలని…

కంటున్నాయీ కలలు నా కళ్ళు…
నీతో ఏడడుగులు నడవాలని..
కలలు కళ్ళ ముందు నిజమయ్యాయి…
నీతో మూడు ముళ్ళ బంధంతో

కానీ.. ఆ కలలను…
కలలు గానే మిగిల్చావు..
కారు చిచ్చుని రగిల్చావు..
కన్నా కలలు కళ్ళలైపాయే..
నీ రాకతో…

నా నూరేళ్ళ జీవితానికి జతగా, తోడుగా, నీడగా, దైర్యం గా, అండగా.. ఉంటావు అని కన్నా కలలు..
కాళ్ల పారాణి కూడా ఆరక ముందే ఆర్పేసావు…

ఎంతో అందమైన భవిష్యత్తు కోసం కలలు కన్నాయి నా కళ్ళు…

– వనిత రెడ్డీ

Related Posts