కళ్యాణ వైభవమే

కళ్యాణ వైభవమే

తలవాల్చి చూస్తున్నావా తలపులలో

కన్య వలపులతో కనులార్పక..

నన్నే చూస్తున్నావా నీ కంటి మీద కునుకు రాక…
నీ ముందుకు నేను రాక…

నా రాకకై ఎదురు చూస్తూ మెరిసే కళ్ళతో నాకోసం చూస్తున్నావా…
నాపై దయ చూపిస్తున్నావా..

దయలేని మానవుడే హృదయం ఉంటే నీ ముందు వాలడా…
వాలుజడల చినదాన నీ ఆశే మెరిసే…
నీ కనుల ముందు నిలిచే నువ్వు వలచిన రాకుమారుడు…

మీ ఇద్దరు కలిసి సీతారామ కళ్యాణ వైభవమే గాంచిరి..

– పలుకూరి

Related Posts