కన్నీటి పాట
వార్ధక్యం ముంచుకొచ్చింది.
శరీరమేమో డస్సిపోయింది.
చేతుల్లోని శక్తి సన్నగిల్లింది.
కష్టానికి ఫలితం లేకపోయింది.
బుట్టలేమో అమ్ముడుపోలేదు.
ఆకలేస్తే అన్నం దొరకటంలేదే.
అవ్వ చేతిలో చిల్లిగవ్వ లేదే.
ఉండేందుకు గూడైనా లేదే.
ఎవరూ సాయపడటం లేదే.
కష్టాలన్నీ తీరే మార్గం లేదే.
కన్నీరు కూడా ఆవిరైపోయింది.
రోడ్డుపై ఓడిపోయావా తల్లీ.
దిగులు పడకు ఓ మంచి తల్లీ.
ప్రజల మనసు తప్పక మారేను.
బుట్టలన్నీ అమ్ముడు పోయేను.
నీ చేతులోకి కాసులు వచ్చేను.
నీ ఆకలి దప్పులు తీరేను.
ప్రజల మనసు తప్పక మారేను.
– వెంకట భానుప్రసాద్ చలసాని