కన్నీరు

ఏ దేశం ఎగిన ఏమున్నది గర్వకారణం…
నరజాతి సమస్తం పరపీడన పరయనతత్వం….
ఆకలికి తాళలేక అలిసిపోయి, నలిగిపోయి, ప్రాణాలిడిచిన జీవులు…
ఉన్నదొకటే జీవితం, కానీ బ్రతకడానికి ఓ పోరాటం…
రోజూ ఆకలి కోసం, ఎడతెరిపిలేని ఆరాటం…
ఒకవైపు ఆకలికోసం ఏర్పడిన వర్గాలు..
మరోవైపు ధనికులకు మాత్రం స్వర్గాలు…
ఏనాడు మారునో ఈ తీరు
నిషీధి సైతం ఈ స్థితిని చూసి కార్చేను కన్నీరు…
నింగికి నేలకి నిచ్చెనలు వేసిన ఈ
అభివృద్ది …
తిండిలేక పోయిన ప్రాణాలకు కట్టాం సమాధులు….
అందరిది ఒకటే బ్రతుకు
ఒకప్రక్క స్వార్దం కలిగిన జీవులు మాత్రం సంపదలకై ప్రాకులాట..
ఇంకోప్రక్క తిండిలేక ఆకలికై ప్రాణాలు విడుచుట…

ఎక్కడ చూసినా వొంగిన నడుంతో కారే కన్నీటితో
చెదిరిన జుట్టుతో జారిన పైటలతో
ఈ సమాధులచుట్టూ వెతుక్కుంటూ తిరుగుతారు…

పారేను కన్నీటి జరి
ఎటు తెలపను నా వైఖరి…

– కుమార్ రాజా

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *