"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

కాంతం హాస్యం

కాంతం హాస్యం

అక్షర0లిపి వారు హాస్య కథ వ్రాయమంటున్నారు.  ఏమన్నా ఆలోచించావా? అన్నాడు రామనాధం కుర్చీలో కూలబడుతూ. ఊరు పొమ్మంటోంది, కాడి రమ్మంటోంది .ఇంకా మీకూ నాకూ హస్యం ఎక్కడ నుండి వస్తుంది లేండి అంది కాంతం. అలా అనకే కాంతం. అలా మాట్లాడితే నాకు చొక్కా చించేసుకోవాలనిపిస్తుందే. అన్నాడు రామనాధం. బ్రతికున్నన్నినాళ్ళు హాయిగా నవ్వుతూ ,నవ్విస్తూ ఉండటమేనే జీవితమంటే అన్నాడు రామనాధం.

తెనాలి రామకృష్ణయ్య ను గుర్తుతెచ్చుకో. నీకు తెలియకుండానే హాస్య కథ వచ్చేస్తుంది. ఉండండి,పక్కింటి వారి అమ్మాయికి పెళ్లి చూపులుట. అందుకే నన్ను అలంకరణ చేయటానికి రమ్మన్నారు అంది కాంతం. ఒసేయ్ కాతం పెళ్ళి చూపులు అనగానే మన పెళ్ళి చూపులు గుర్తొస్తున్నాయే.

బొద్దుగా ఉన్న నువ్వు లంగా ఓణీ వేసుకుని,ఒక బండెడు చేమంతి దండ బిగుతుగా వేసిన జడలో పెట్టుకుని నువ్వు కదలి వస్తుంటే గంగిరెద్దు గుర్తొచ్చిందనుకో అన్నాడు రామనాధం. మరి అయితే నన్నెందుకు చేసుకున్నారుట? అంది బుంగమూతి పెట్టిన కాంతం. గంగిరెద్దు మాత్రం బాగుండదుటే. సంక్రాంతి నెలలో గంగిరెద్దతను ఆడిస్తుంటే లయగా అడుగులు వేస్తూ వాడు చెయ్యమన్నట్లు చేస్తుంటే అందరూ చూడముటే. ఎందుకే బాబు నీకు అంత కోపం అన్నాడు రామనాధం.

సర్లెండి,బజారు వెళ్ళి పది సరుకులు తెమ్మంటే వంద సార్లు ఫోన్ చేస్తారు కానీ ఇలాంటివి మాత్రం బాగా గుర్తుంటాయి అంది
కాంతం చిర్రుబుర్రులాడుతూ. ఇలాంటివి తీయని అనుభూతులే.ఎలా మర్చేపోతాను అన్నాడు రామనాధం. ఇంతకీ నేను ఎందుకు నచ్చానుట? హాయిగా గుంటూరు సంబంధం చేసుకుంటే హాయిగా సుఖపడేదాన్ని కదా.మిమ్మల్ని కట్టుకుని సుఖపడ్డ రోజులు వేళ్ళ మీద లెక్ఖ పెట్టవచ్చు అంది కాంతం.

అదే నాకు గుర్తుచెయ్యద్దన్నాను.ఏం సుఖపడేదానివి. పెరటి నిండా గొడ్లు,ఇంటి నిండా వడ్ల బస్తాలు ను.ఇంకా పిప్పళ్ళ బస్తాలా అయ్యి,నీ వళ్ళే నువ్వు మోసుకోలేక పోయేదానివి అన్నాడు రామనాధం. ఇంటినిండా పనిమనుషులు, వంటినిండా బంగారం ఉండేది.మిమ్మల్ని కట్టుకుని,ఈ పసుపు తాడు,నల్లపూసలేగా నాకు అంది కాంతం. ఉండవే,రేపు రిటైర్మెంట్
బెనిఫిట్స్ రాగానే నీకు ఏడువారాల నగలు చేయిస్తాను అన్నాడు రామనాధం.

ఏడ్చినట్లే ఉందిలేండి.చావు తరువాత లావు దుఃఖం అని ఇప్పుడు చేయిస్తే ఎవడన్నా నా నెత్తి బద్దలు కొడితే మళ్లీ పెళ్లి చేసుకోవచ్చనా మీ ఉద్దేశ్యం అంది కళ్ళ నీళ్ళు తిప్పుకుంటూ అంది కాంతం. ఓసినీ దుంప తెగ.ఎక్కడికెళ్ళి పోయావే తల్లీ. ఎందులో అయినా దుఃఖాన్నే వెతుక్కుంటావేమే తల్లీ అన్నాడు రామనాధం. తమలపాకుతో నేనొకటంటే తలుపు చెక్కతో నీవొకటంటావని బాగుందే తల్లి,వెళ్ళిరా. ఆ పెళ్ళి కూతురు డెకరేషనేదో చూడు.నీకు మల్లే మాత్రం చెయ్యకు.వాడు పరిగెత్తు కెళ్ళిపోతాడు. అంటూ కాంతాన్ని పక్కింటికి పంపించాడు రామనాధం.

అక్షరలిపి వారు రాయమనడం ఏంటి అని అనుకుంటున్నారా? మన వాట్స్ అప్ సమూహంలో రోజూవారి అంశాలు ఇస్తున్నారుగా… ఏంటి? మీరు ఆ సమూహంలో లేరా? అయితే, aksharalipi.official@gmail.com కి ఒక మెసేజ్ పెట్టండి చేరాలనుకుంటున్నా అని… వాళ్ళు ఒక లింక్ పంపుతారు దాని ద్వారా జాయిన్ అవ్వొచ్చు

– రుద్రపాక సామ్రాజ్య లక్ష్మి

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *