కనువిప్పు తథ్యం!!

కనువిప్పు తథ్యం!!

ఏకధాటిగా
కారు నీ కన్నీటి బిందువులు
సాగరానికి సరి ఆయెనా….!

అమ్మా,
నీ హృదయమందలి
మహాసముద్రం ఆవిరైపోయెనా ….!

నీ నేత్రాలు
పొడిబారిపోవునేమో…….!
ఆపుము తల్లీ,
చేరనీకు నీ అశ్రు బిందువులను
రక్తాశ్రువులు………..!

నీ,
వారసత్వము
ఆడుచుండెను
జలకాలు ఈ సాగరంబున.

శాంతించుము జననీ,
నీ బిడ్డలు
సుడిగుండాల లో చిక్కి
ఉక్కిరిబిక్కిరై,
నీ పాదాల చేరెదరు.
శాంతించుము తల్లీ ..!

– వాసు

Related Posts