కనువిప్పు

కనువిప్పు

బరణి కార్తె మొదలయింది. వానలు బాగకురిసాయి. రైతులంతా నేలను దుక్కి దున్నుతున్నారు. నాణ్యమైన వేరుశనగ విత్తనాల కోసం వేరుశనగ కాయలను పరిశీలిస్తున్నారు. కాయలను మిషన్ ఆడించి మంచి, నాసిరకం విత్తనాలను వేరుచేసి విత్తడానికి తయారుగా పెట్టుకున్నారు. నేను కూడా గొర్రు, గుంటుక మొదలగు వాటిని సర్ధిపెట్టుకున్నాను.

మరుసటి రోజు అందరం విత్తనాలు విత్తుకున్నాం. పంటవేసి 4 నెలల సమయం కావడం వల్ల పంట కోయడానికి నిశ్చయించుకున్నాము. పోలేరమ్మ జాతర చేసి పంట కోయడం ప్రారంభించాము. తరువాత పంటను కల్లము లోకి వేసి, కాయలను విడిపించి ఎండబెట్టి సంచులకు నింపడం మొదలుపెట్టాము.

పక్క సేను రామయ్యది 1 పల్లా విత్తనాలకు 20 సంచుల కాయలు కాసింది నాది 5 సంచుల కాయ మాత్రమే కాసింది. ఇది ఏదో మోసం జరిగిందని ఊరిలోని పెద్దమనిషిని న్యాయం చేయాలని కోరాను. దండోరా వేయించి నన్ను, రామయ్యను పంచాయితీ దగ్గరికి పిలిపించారు, జనాలంతా గుంపుగా చేరుకున్నారు. పెద్ద మనిషి విత్తనాలు ఇద్దరూ ఒకటే రోజు వేసినారు రామయ్య విత్తనాలతో పాటు ఇంకా ఎదైనా వేసావా? అని అడిగాడు.

రామయ్య, “ఎరువులు, పురుగుమందులు, రెండుసార్లు కలుపులు తియించాను అయ్యా”! అని చెప్పాడు. పెద్దమనిషి నన్ను అడిగాడు నువ్వు ఏమి వేసావు అని “విత్తనాలు మినహా ఏమీ వేయలేదు అయ్యా” అని అన్నాను. ఊరిలో వారంతా నవ్వసాగారు. అయ్యగారు దగ్గరకు పిలిచి “నువ్వు గాలిలో దీపం పెట్టి ఎందుకు ఎక్కువసేపు వెలగడం లేదు అని చూస్తున్నావు, మళ్ళీ విత్తు కాలానికి నెలలో సారాన్ని పెంచి పంట పండించు” అని చెప్పి కనువిప్పు కలిగించాడు.

– హనుమంత

Related Posts