కథా సమీక్ష

కథా సమీక్ష

 

మన అక్షర లిపిలో వెంకట భాను ప్రసాద్ గారు రాసిన త్యాగనిరతి అనే కథ నాకు చాలా బాగా నచ్చింది. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వారి వారు, వారికి ఉన్న భూమిని దత్తపుత్రుడికి ఇవ్వడం అది కూడా ఒకటి కాదు రెండు కాదు 22 ఎకరాలు ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు.

ఇప్పుడు అదే భూమి ఉంటే భాను ప్రసాద్ గారు కోట్లకు అధిపతి అయి ఉండేవారు.

కానీ అలా కాకుండా ఎవరు ఏ ఆర్డర్, చెప్పకుండా తాత తండ్రి మాటకు ఎదురు చెప్పకుండా, ఆయన చెప్పిందే శాసనంగా భావించి మిన్నకున్నారు. వారి చివరి దశలో వారు ఎన్నో కష్టాలు అనుభవించిన కూడా ,చివరికి వారు దత్తపుత్రుడుగా తీసుకున్న అతనికి దానం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం.

వారు పరమపదించాక కూడా ఉన్నవారు ఇది మా భూమి నాకే చెందాలి, అని పట్టు పట్టకుండా కోర్టుల చుట్టూ తిరగకుండా, పంచాయతీలు పెట్టకుండా, తమ తాతగారి కోసం తమ తాతగారు ఇచ్చిన మాటను నిలబెట్టారు. అంటే వారు ఎంత ఉన్నతమైన ఆలోచన చేసి ఉంటారు., అనేది మనం ఇక్కడ గమనించాలి.

వారి ఉన్నత మనసులు, ఒకరికి ఇచ్చిన దాన్ని తిరిగి తీసుకోకపోవడం, అనేది వారి గొప్పదనానికి నిదర్శనంగా నేను భావిస్తున్నాను.

అలాగే అక్కడ తనవారు ఎవరు లేకపోయినా కూడా బంధువులు ఉన్నారు, అని భావిస్తూ ప్రతి సంవత్సరం వెంకట భాను ప్రసాద్ గారు వేసవికాలంలో అక్కడికి వెళ్లి వస్తూ ఉంటారు, అంటే వారికి బంధాలు, బంధుత్వాలు అంటే ఎంత ప్రీతికరమో చెప్పకనే చెప్పారు.

అక్కడికి వెళ్లినవారు ప్రతిసారి ఇది మా ఊరు ఇది మానేలా ఇదే నేను చదువుకున్న పాఠశాల ఇక్కడే పింగళి వెంకయ్య గారు జెండా రూపకర్తన చేశారు. అంటూ ఎంతో గొప్పగా చెప్తూ ఉంటారు.

నేను ఈ కథను సమీక్షగా తీసుకోవడానికి కారణం ఏమిటంటే అప్పటి పెద్దవారు మాటకు కట్టుబడి ఉండేవారు ఒక్కసారి మాట ఇస్తే కనుక వెనక్కి తీసుకునే పద్ధతి వారి దగ్గర ఉండేది కాదు అందువల్లే నేను ఈ కథను సమీక్షకు తీసుకున్నాను.

మనం కూడా కొన్ని కొన్ని మాటలకు కట్టుబడి ఉంటాం. ఆ మాటలను ఎప్పటికీ మర్చిపో ఒకసారి మాట ఇస్తే తిరిగి ఆ మాటను వెనక్కి తీసుకోము అయితే ఇప్పటి తరం వారు మాట మాట్లాడిన వెంటనే మరచిపోతుంటారు. మాట ఇచ్చిన తర్వాత కూడా నేను ఎప్పుడు అన్నాను నేనేం చేశాను అంటూ మాటలు దాట వేస్తూ ఉంటారు.

అలాంటి వారికి ఈ కథ ఒక కనువిప్పుగా అవుతుందని నేను ఈ కథను  సమీక్షగా తీసుకోవడం జరిగింది. కాలు జారితే తీసుకోవచ్చు, కానీ మాట జారితే తీసుకోలేము అని పెద్దలు ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థం అవుతుంది. ఈ కథ చదివిన తర్వాత నాకు ఇంకా బాగా అర్థమైంది.

ఎందుకు ఈ కథకు ఇంతగా నేను కనెక్ట్ అయ్యాను అంటే. మా తాత .ముత్తాతలు కూడా ఇలాగే మాటలు ఇచ్చి. చాలా భూమిని పోగొట్టుకున్నారు. అయ్యా మాకు ఇల్లు లేదు. మేము ఒక గుడిసె వేసుకుంటాం అని అంటే. సిగరెట్ కాగితాల మీద రాసి ఇచ్చేవారు జాగాను. మళ్ళీ ఆ స్థలానికి వెళ్లేవారు కాదు. మాటంటే అది. ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత .లేదా ఒక వస్తువును ఒకరికి దానం చేసిన తర్వాత తిరిగి దానిని అడగడం కుషిత బుద్ధి అవుతుంది.

తప్ప మరొకటి కాదు. కొన్ని కోట్ల విలువ చేస్తే భూమిని అప్పటి పెద్దలు మాట కోసం అయ్యో పాపం అనే జాలితో దాచి ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ స్థలం కొన్ని కోట్లు పలుకుతుంది. అని అప్పటి మన తాతలకు తండ్రులకు తెలియదు.

పెట్టిన అన్నాన్ని తిరిగి కోరకూడదు అంటారు. అలాగే ఒక మాట మీద నిలబడిన మనుషులను కూడా మాట తప్పడం మంచిది కాదని కూడా చెప్తారు. పెద్దలు ఊరికే అనలేదు మన మాటలు వారు ఇచ్చిన, దానాలు, ఇప్పటి మన జీవితానికి మన పిల్లల జీవితానికి ఎంతో ఉపయోగంగా ఉంటున్నాయి.

వారు చేసిన దానాలు వల్ల మనం మన పిల్లలు సుఖంగా ఉంటున్నాం అనేది పచ్చి నిజం. ఈ మాట ఎవరు ఒప్పుకోకపోయినా ఇదే నిజం.

ఎందుకంటే మనం చేసిన పనులే ,మన పిల్లలకు వారి కర్మలుగా వస్తాయి, ఎంత దానం చేస్తే అంత మంచిది. అప్పటి పెద్దవారు దానం చేశారు, కాబట్టే కనీసం ఇప్పుడు మనం నాలుగు మెతుకులు తినగలుగుతున్నాం.

అంటే మీరు అనవచ్చు మనం సంపాదించుకుంటున్నాం కష్టపడి తింటున్నామని, కానీ వేరే మిగతా వారిని చూసి, మిమ్మల్ని చూసి, ఒక్కసారి మీకు మీరే ఆలోచించుకోండి. వేరే వారు ఎలా బతుకుతున్నారు మీరు ఎలా బ్రతుకుతున్నారు, అనేది బేరీజు వేసుకుంటే అర్థం మీకే తెలిసి వస్తుంది.

-భవ్యచారు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *