కఠోరశ్రమ

కఠోరశ్రమ

సాధించే విజయాల వెనుక
సంగతులు ఎన్నో ఉంటాయి

జీవితాలు మారడానికి సోపానం కఠోర శ్రమ

స్ఫూర్తి పొందుతారు కలల
సాకారం కోసం

గడిచేకాలంలోశ్రమకుమించి
ప్రతిభ తోడుగా ఆరాటం

ఆలోచనల రహస్యాలను
చేధిస్తూ నిర్ణయాల పరిధిలో

సాధించాలనే తపన
ఆశయాల సాధనకుపునాది

మనోబలంమందగించకుండా వుండాలి సంకల్పదీక్ష లో

ఆ శ్రమ బాధ్యత లోనూ
భవితలోను, వృత్తిలోను
మనసుకు నచ్చినదో మరి

గెలిచి తీరాలనే లక్ష్యం
తృప్తినిచ్చే పనులు

కనిపించే శ్రమ వెనుక
దాగిన సంతోషాలసమయం

విజయానికి మెట్టులా స్వయంకృషికి అద్దంలా

ఏకలవ్యుని బాణంలా
కఠోర శ్రమ ఫలితం కోసం
వేచిచూడాలి కదా!

– జి జయ

Related Posts