కవిత

కవిత

నిను ఈ క్షణం చూడాలనిపిస్తుంది, మరీ ఎలా,? అనంత తీరంలో చకోరపక్షిలా ఒక్కడినే ఎన్నాళ్ళు ఎదురుచూడను?

ఇప్పటికే నామనస్సు చక్కలుమ్రుక్కలై చెల్లాచెదరై పోయింది అద్దం పగుల్లవలే,

భవిష్యత్ అందాకారమై, నీవు కనిపిస్తావనే చిన్న ఆశ , అడుగంటిన నా ఆశలకు ఊపిరులూదుతుంది,

క్షణమొకయుగంలా గడుస్తూవుంటే, దారంతెగిన గాలిపటంవలె మనస్సు ఊగిసలాడుతూ ఉంటే,

చీద్రమైన నా ఉహాలపల్లకి ఊగిసలాటలో పయనిస్తూ ఉంటే, ఎక్కడో ఓ వెలుగురేఖ కనిపించిన ఆక్షణాన,

అది నీవేనని, నానయనాలు జలాశయాలై వర్శిస్తూవుంటే, అది నీవుకావని తెలిసిన ఆమరుక్షణానా,

ఇంకా మరణం రాలేదేమని? గొంతుచించి అరవాలని వున్న గొంతు పెగలని నిస్సాహయత ఎందుకో చెప్పవూ.

– పోరండ్ల సుధాకర్

Related Posts