కవిత్వం-డిక్షన్(poetry-diction)

కవిత్వం-డిక్షన్

కవిత్వం-డిక్షన్(poetry-diction)

 

ఇవాళ చాలామంది కవిత్వం రాస్తున్నారు.కాని కవిత్వం అంటే ఏమిటో తెలుసుకొని రాస్తున్నారా?అసలు కవిత్వం రాయడం ఎలా ?అన్నది తెలుసుకునే రాయాలా?అంటే కచ్చితంగా అవునని లేక కాదని చెప్పలేం కాని తెలుసుకుని రాయడం వల్ల దారి తెలుస్తుంది.గమ్యం చేరుకోవటానికి ఏదారి వెళ్ళినా ఒకటే అయినా మంచిదారిలో సునాయాసంగా వెళ్లడం మంచిది కదా?ఇక ఆధునిక వచన కవిత్వం రాసేవారు మెుదట గమనించాల్సిన విషయాలు..

 

1.కవిత్వమంటే తెలుసుకుని రాస్తున్నారా?
2.కవితా నిర్మాణ పద్ధతులు అంటే ఏమిటి?
3.symbol అంటే ఏమిటి?
4.simile అంటే ఏమిటి?
5.పదచిత్రాలు,భావచిత్రాలు ఎలా ప్రయోగించాలో తెలుసా?
6.imagery అంటే ఏమిటి?
7.మెటాపర్లవాడకంలో మెలకువలు ఎందరికి తెలుసు?
8.కవితా నిర్మాణాలు ఎన్ని రకాలుగా ఉండవచ్చు..
9.పొట్టి కవితలే రాయాలా?పొడవాటి కవితలు రాయకూడదా?
10.poetic dictionలో stylistic elements ఏమైనా ఉన్నాయా?
11.వచన కవిత్వపు భాష ఎలా ఉండాలి?

 

పై వాటి గురించి క్రమంగా ప్రతివారం విశ్లేషిస్తాను.ఎందుకంటే వాటి గురించి కొంచెం తెలుసుకుని ఉంటే కవితలు రాయడంలో కొంత మెచ్యూరిటీ వస్తుంది.చాలామంది ఇప్పటికీ కాకి చిందరవందరగా పుల్లలు పేర్చి గూడు కట్టినట్టు ఏవో కొన్నివాక్యాలు పేర్చి కవిత్వ రాసేస్తుంటారు. వచనమై తేలిపోయే వాక్యాలు కవితా పాదాలు అవుతాయా?సంస్కృత పదాలు ఎంత ఎక్కువగా వాడితే కవిత అంత గొప్పగా ఉంటుందన్న భ్రమల్లో మన కవులు ఉన్నారు.గేయానికి వచన కవితకు తేడా లేదని చాలామంది ప్పటికీ అనుకుంటున్నారు. పద్యవారసత్వాన్నుండి పద్యాల రాగసౌరభాల మత్తునుండి మనవాళ్లు ఇంకా బయట పడలేదు.పద్యానికి గేయానికి వచనకవిత్వానికి తేడా తెలియనివాళ్ళు ఇంకా ఉన్నారు.

ఆ విషయం నేను వచనకవితా సంపుటాలకు ముందుమాటలు రాస్తున్నప్పుడే తెలిసింది.అయినా ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఇవాళ కవిసమ్మేళనాలు బాగా జరుగుతున్నాయి.కొత్త కవులు కవితా సంపుటాలు అచ్చువేసుకుంటున్నారు.ఇవన్నీ సంతోషించదగ్గ విషయాలే కాని కవిత్వం విషయానికి వస్తే వాసికన్నా రాసే ఎక్కవనిపిస్తుంది.పసలేని కవిత్వం ఎక్కువమంది రాస్తున్నారు. అయితే కొంత మంది యువకవులు కవయిత్రలు పెద్ద కవులకు తీసిపోనివిధంగా కవిత్వం రాస్తున్నారు.అయితే ఎక్కువమంది కవితాత్మను పట్టుకోలేక పోతున్నారు.కవితా నిర్మాణం పట్ల సరైన అవగాహన పెంచుకోలేక పోతున్నారు.వచన కవిత్వపు భాషను ,కొత్త మెటాపర్లను..తమదైన తాత్విక దృష్టిని..అనుభూతి గాఢతను..అభివ్యక్తి నవ్యతను పెంచుకోలేక పోతున్నారు.అందుకే…ఇవన్నీ చూసి..ముందుమాటలు రాసేవాళ్లు కొత్త కవులకు కొన్ని సూచనలు ఇస్తున్నారా?అంటే ఇవ్వరు..ఎందుకు?అంటే వారి వర్గం నుండి ఎక్కడ జారి పోతారోనని భయం.

ఇక వర్గాలు,కూటాలు,పీఠాలు..సాహిత్యంలో రాజకీయాల గురించి గత కొన్నేళ్ళుగా వ్యాసాలు,సమీక్షలు,విమర్శలు రాసి రాసి విసిగి పోయాను.అది అలావదిలేసి ఇప్పుడు కొత్తగా కలం పట్టిన వారికోసం నాకు తెలిసిన విషయాలు తెలియజేయాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను.ఎక్కువ మంది కవులు తయారయితే సమాజం బాగు పడుతుందన్నఒకేఒక ఆశతో ఈ నా చిరు ప్రయత్నం..ఇక కవిత్వం ఎలా ఉండాలి ? అసలు కవిత్వం ఎప్పుడు పుట్టింది? కవితా నిర్మాణాలు ఎలా ఉండేవి? వాటిలో ఎలాంటి మార్పులొచ్చాయి?ఇప్పుడు ఉన్న కవిత్వంలో ఎలాంటి రూపనిర్మాణాలున్నాయి?మెుదలైన విషయాలు తెలసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కవిత్వం ఎప్పుడు పుట్టిందని కచ్చింతంగా ఎవరూ చెప్పక పోయినా సంస్కృత వేదాల్లో,జొరాస్ట్రియన్ గాధల్లో,చైనీస్ షిజింగ్ లో,హోమర్ ఒడిస్సీలాంటి కావ్యాల్లో..కవిత్వం తళుక్కు మందని చెప్పుకోవచ్చు.అంతకు ముందు జానపదసాహిత్యంలో ఉండి ఉంటుంది.1886 లో గ్రీకు కవి jean moreas ఎంతో కష్టపడి మెుట్ట మెుదట కవిత్వం గురించి symbolist manifesto ను ప్రకటించడంతో కవిత్వంపై చర్చలు మెుదలయ్యాయి. అంతవరకు వచ్చిన కవిత్వంలోని objective discription కు వ్యతిరేకంగా సింబాలిక్ కవులు కవితా నిర్మాణంలో traditional rules ధ్వంసం చేసి కవితానిర్మాణంలో ,అభివ్యక్తిలో,మెటాపర్లవాడకంలో..మెుత్తం కవిత్వపు diction నే మార్చేశారు.

ఆ ప్రభావంతో ప్రపంచదేశాలలోని మేధావులు కవులు,విమర్శకులు కొత్త మార్గాలను అన్వేషించారు.అలా మన తెలుగులో ఆధునికి కవిత్వం ప్రారంభమయింది.శ్రీశ్రీ కవిత్వంలో కొత్త diction ను మనం చూశాం.కవితా నిర్మాణంలో సింబల్స్ ఉపయోగించడంలో ఆయన ప్రేంచ్ కవులను ,రష్యన్ కవులను అనుసరించిన అనుకరించిన విషయం తెలిసిందే..అటు తర్వాత కట్టమంచి రామలింగా రెడ్డి కవిత్వతత్వ విచారంలో కవిత్వాన్ని గురించి కొత్త కోణాలను ఆవిష్కరించారు.ఆయన కళాపూర్ణోదయంలోని కధనశిల్పాన్ని కొత్త diction తో వక్కానించినట్టే కవిత్వానికి భావనాబలం ముఖ్యమంటే చాలా మంది కవులు అనుసరించారు.

అలాగే అభ్యుదయ కవిత్వంలో అరుపులు కేకలు తప్ప కవిత్వం లేదని గుంటూరు శేషేంద్రశర్మ కవిసేన మానిఫెస్టోతో కవిత్వంలో కొత్త diction ను ప్రవేశ పెట్టడంతో ఎంతో మంది కవులు ఆయన మార్గాన్ని అనుసరించారు.శేషేంద్ర రాసిన నాదేశం నా ప్రజలు కావ్యంలో వచనం అద్భుతమైన కవిత్వమైపోయింది.వచన కవిత్వపు భాష మారిపోయింది.విప్లవాన్ని వచనకవిత్వంలో ఎంత అద్భుతంగా చెప్పాలో అంత అద్భుతంగా ఆయన చెప్పాడు.

ఇక కుందుర్తి తెలంగాణా కావ్యంతో వచన కవితా పితామహునిగా మారిపోయాడు.ఆ తర్వాత వచ్చిన విప్లవ దిగంబర అస్తిత్వ ఉద్యమాల కవిత్వం..ఇటీవల ప్రపంచీకరణ నేపథ్యంలో వస్తున్న వచన కవిత్వంలో వస్తువు అభివ్యక్తి,ప్రతీకల వాడకం ,కవిత్వపు భాషలో,అభివ్యక్తిలో అనూహ్యమైన మార్పులొచ్చాయి.కొందరు బాగా కవిత్వం చదివి రాసినా ,మరికొందరు చదవక కేవలం పరిశీలనతో అనుకరణ విద్యతో రాసినా మంచి కవిత్వం రాస్తున్నారు.

ఇప్పుడు కవిత్వం పెద్దలు చిన్నలు అన్నతేడా లేకుండా అప్పుడే కలం పట్టిన వాళ్ళు కూడా మంచి కవిత్వం రాస్తున్నారు.అదే స్థాయిలో కవిత్వం కాని కుకవిత్వం కూడా మార్కెట్లోకి వస్తోంది.ఏది ఏమైనా చాలామంది కవులు కవిత్వం రాస్తున్నారు.ఇదొక మంచి పరిణామం.ఇక పోతే కవిత్వం రూపం(form)లో simili and metapher వాడకంలో tones of voice లో ఎంతో ప్రగతి కనిపిస్తుంది.ఒక్కో కవిది ఒక్కో అభివ్యక్తి…అలా నేడు కవిత్వం రాస్తున్న కవులు వారి కవితలు ,కవితా సంపుటాల సమీక్షలు విశ్లేషణలద్వారా poetic diction గురించి విశ్లేషించుకుందాం..

ఇవాళ సంచలనాత్మక నవలా రచయిత ప్రభాకర్ జైనీ కొత్త డిక్షన్ తో కవిత్వం రాస్తున్నాడు.ఆయన రాసిన పాదముద్రలు కవిత్వం లో ఓ కొత్త వొరవడి ఉందనే చెప్పాలి.ఒక దేవుడిని symbolic గా తీసుకొని సరికొత్త అభివ్యక్తితో పాదముద్రలు కవిత కుందుర్తి narrative poetic style లో అద్భుతంగా రాశారు.అలాగే I hate mornings ..i love evenings అంటూ సరికొత్త భాషాసమ్మేళనంతో చక్కని కవిత్వం రాశారు.modernism ప్రారంభమయ్యాక చాలామంది కవులు కొత్త poetic diction ను ఎంపిక చేసుకున్నారు.

ప్రభాకర్ జైనీ విస్తృతంగా విదేశీ సాహిత్యం చదవడం వల్ల ఆయన రచనల్లో కొత్త దనం కనిపిస్తుంది.ట్రాఫిక్ ఎన్ని వంకర్లు తిరిగినా మా ఆవిడ జడే గుర్తుకొస్తుంది
మా ఆవిడ మల్లెపూలు,మంచిచీరతో సింగారించుకునికేవిశ్వనాథ్ సినిమాలోని నాయికలా ఎదురొస్తేప్రపంచమంతా ప్రశాంతమై శాంతి సందేశం మారు మ్రోగుతుందితనిచ్చే కాఫీ కాఫీరాగంలా… తనచూపు మోహనరాగంలామది హింతోళమైతే..మదనుడు జతగాడైతే..

ఇలా కొత్త diction తో కవిత్వం అలవోకగా రాసుకెళతాడు.ఇలాంటి సింబాలిక్ prose poetry ఇవాళ కొత్తగా పుట్టిందేం కాదు.19 శతాబ్దంలో ప్రాన్స్ లో పుట్టింది.1980 లో stephane mallarme(the prose poem:an international journal)అద్భుతంగా చెప్పారు.poetic diction లో రెండో అంశం imagery for effect.ప్రభాకర్ జైనీ కవితలో ట్రాఫిక్ వంకర్లుతిరడంలో వాళ్ళావిడ జడ గుర్తుకురావడం..

.సింబాలిక్ expression అయితే విశ్వనాథ్ సినిమాలోని నాయికలా ఎదురు రావడం imagery effect .అంతేకాదు కాఫీ కాఫీరాగంలా చూపు మోహనరాగంలా ఉందనడంలో ఎంతో jargon beauty ఉంది.కవిత్వపు పరిభాషలో jargon అంటే
language peculiar to a particular trade or content అంటే ఇక్కడ చూపు మోహనరాగం అనడంలో నాకు తెలిసి మోహన రాగం ఎంతో ప్రశాంతంగా మనసును రొమాంటిక్ మూడ్ లోకి తీసుకెళ్లేవిధంగా ఉంటుంది.అందుకే ఈ కవితా పాదాల నిర్మాణంలో ఒక కొత్త భాషను అర్థవంతంగా వాడి కవితను రంజింపజేశారు.

అలాగే మతం గురించి ఒక కవిత రాస్తూ హిందూ ముస్లీంల సఖ్యతను నెమరేస్తూ మధ్య ఎవరుగొడవలు సృష్టిస్తున్నారో సింబలైజ్ చేస్తూ చివరకు..కవితను చక్కగా ముగించారు.
అందుకే అల్లాను నమ్ముకున్నాము
రాముడి కొండ మీద ఒక్కటయ్యాము
మా ఇద్దరి అమ్మానాన్నలు అండగా నిలబడగా
ఆలుమగలయ్యాము ఆశలఒడి నింపుకున్నాము
విశ్వమానవ ప్రేమకు మేం కరదీపికలయ్యాము
అంటూ కవితను ముగిస్తారు.ఇప్పటికీ చాలా మంది మతం గురించి,కులం గురించి కవిత్వం రాస్తే కవితా నిర్మాణంలో cacophony పదబంధాలతో అదరగొడతారు లేదా బెదిరిస్తారు.కవితానిర్మాణంలో harash words ను poetic effect కోసం ఉపయోగించడాన్ని cacophony అంటారు.ఏతావాతా చెప్పొచ్చే దేమిటంలే కవిత్వం ఎవరు రాసినా చక్కని భాషను..అర్థవంతమైన భాషను ఉపయోగించాలని,కవితా నిర్మాణంలో తనదైన శైలిని నిర్మించుకోవాలని..పోలికలు కొత్తగా ఉండాలని ఉదాహరణకు..వాలుజడను..తుమ్మెదల వరుసతో పోల్చారనుకో ..అది పాతచింతకాయపచ్చడే అవుతుంది..

ఇక్కడ ప్రభాకర జైనీ ట్రాఫిక్ వంకర్లతో ఉపమించాడు..అదే కొత్తదనమంటే..కవిత్వం పండితులే బాగారాస్తారన్న భ్రమల్లోఇంకా చాలా మంది ఉన్నారు.భాషపైన కమాండ్ ఉన్నవాళ్ళ కవిత్వం పటుత్వంగా ఉంటుందనుకుంటే పప్పులో కాలేసినట్టే..అవన్నీ ఒకప్పటి మాటలు..ఇప్పుడు కవిత్వంలో vision మారింది diction మారింది.expression (అభివ్యక్తి) మారింది.form(రూపం)మారింది.

భాషమారింది.మీకు తెలిసిన భాషలో కవిత్వం రాయవచ్చు. మీకు తెలిసిన వస్తువుపై కవిత్వం రాయచ్చు.మీరు దేనిపైన అయినా కవిత్వం రాయెుచ్చు.మీరు రాసే వస్తువు పవిత్రం..అది ప్రేమపై గావచ్చు..విప్లవంగావచ్చ..మీ బాధకావచ్చు..అనుభూతికావచ్చు..వస్తువు ఏదైనా సరే..తప్పులేదు..ఇదేరాయాలని ఇలాగే రాయాలని ఎవడు చెప్పినా వినకండి.కాకపోతే కొన్ని విషమయాలు తెలుసుకుంటే మంచిది .

కవిత్వం ఎలా రాయాలో కొంత మార్గదర్శకం అవుతుంది.అంతకంటే ముఖ్యంగా మీకు కావాల్సింది..నేను రాయగలననే నమ్మకం.. ఆత్మవిశ్వాసం..ఒకరిముఖాల్లా మరొకరి ముఖాలు ఉండవు..అలాగే కవిత్వం కూడా..కాకపోతే అందంగా అలంకరించుకోవడం ,మాట్లాడటం,నడవటం,లాంటిదే కవిత్వం….నేటి గొప్ప కవులంతా ఒకప్పటి మీలాంటి యువకవులే… కవిత్వం రాయండి..కవిత్వమై జీవించండి…కవిత్వం మీ శ్వాసఅయితే మీ జీవితమే కవిత్వమైపోతుంది…all the best….

గురువర్ధన్ రెడ్డి

జట్కా జంగయ్య Previous post  జట్కా జంగయ్య
కామేశం కథలు- 2 Next post కామేశం కథలు- 2

One thought on “కవిత్వం-డిక్షన్(poetry-diction)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close