కవిత్వం ఓ పదునైనా ఆలోచన తత్త్వం

కవిత్వం ఓ పదునైనా ఆలోచన తత్త్వం

కవిత్వం ఓ నీగూఢ భావ సరళత్వం
కవిత్వం మూర్తిభవించిన మాతృత్వం

కవిత్వం ఘనిభవించిన
గుండెలోతు అగాధంలో
పెను ఉప్పెన..,
విప్లవ స్ఫూర్తి సందేశం…!

కవిత్వం ప్రశ్నించే తత్వం
కవిత్వం ఎదురించే ధీరత్వం

కవిత్వం ఓ ఆవేశం
సన్మార్గ ఆలోచనమయం…!

కవిత్వం ఆవేదన నిండిన
భావ గాఢత శోక సంద్రం

కవిత్వం ఓ ఇంపు కమ్మని సొంపు

కవిత్వం ఓ గిజిగాడు నేర్పు
కవిత్వం ఓ సృజనాత్మకత ఓర్పు

కవిత్వం ఓ అందమైన పదాల అల్లిక
కవిత్వం కొన్ని అద్భుత భావాల పొందిక

కవిత్వం ఓ వెన్నల్లో ఆడపిల్ల
కవిత్వం ఓ మల్లెల సుగంధ మాల

కవిత్వం ఓ కదలిక కవిత్వం ఓ నడవడిక
కవిత్వం ఓ స్పందన కవిత్వం ఓ ప్రతిస్పందన

కవిత్వం ఓ చైతన్యం కవిత్వం ఓ ప్రగతిపథం
కవిత్వం ఓ స్వచ్ఛమైన కన్నెతనం

కవిత్వం నిత్యయవ్వన రూపగుణం
కవిత్వం నిత్యనూతన భావగుణం

కవిత్వం ఎప్పటికి అసంపూర్ణం లిఖించలేని
కవి ఆర్భాట అద్భుత తన్మయత్వం…!

కవిత్వం అక్షరకావ్యశ్రీ భావజాలం
సైదాచారి వ్యక్త రాత మయం..!!

ప్రపంచ కవిత దినోత్సవ
శుభాకాంక్షలు అందరికీ..!!

– సైదాచారి మండోజు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress