కవ్వింతల ఆంటీ

కవ్వింతల ఆంటీ 

బాబు దినకర్ ఏం చేస్తున్నావు అంటూ లోనికి వచ్చింది కవిత ఆంటీ ఆ వస్తున్నా అంటూ బాత్రూం లోంచి ఆదరాబాదరాగా టవల్ కప్పుకుంటూ వచ్చాడు దినకర్ అబ్బా ఎంటి ఈ ఎక్స్ పోజింగ్ నాకు సిగ్గు బాబు అంటూ కళ్ళతో మొహాన్ని కప్పుతూ, చాటుగా దినకర్ బాడీని ఆబగా చూస్తూ ఉండి పోయింది కవిత ఆంటీ.

ఏంటి ఆంటి వచ్చేటప్పుడు కాస్త తలుపులు కొట్టి రావచ్చు కదా అన్నాడు షర్ట్ వేసుకుంటూ దినకర్. హా నా ఇంట్లోకి నేను రావడానికి నీ పర్మిషన్ తీసుకుని రావాలా ఏంటి? అంటూ ఇదిగో నీ కోసం మునక్కాయల కూర చేశాను అన్నం తిను ప్రొద్దున్నే అన్నం తింటే కడుపులో చల్లగా ఉంటుంది అంటూ, గిన్నెలు అక్కడ పెట్టింది కవిత ఆంటి.

అయ్యో ఆంటీ మీరు ఇలా తేవడం ఎందుకు? నేను వండుకుంటా కదా అన్నాడు దినకర్ మొహమాట పడుతూ.. అయ్యో తెచ్చిస్తే ఏమైందమ్మా? మా ఇంట్లో ఒక్కరికీ సరిపడా ఉంటది అదేదో నికు ఇస్తే కనీసం నీ కడుపు అయినా నిండుతుంది కదా అని ఇచ్చాను.

This contains an image of: {{ pinTitle }}

అది తప్పేనా దినకర్ నువ్వంటే నాకు ఇష్టం కానీ నువ్వే నా మిద ఇష్టం పెంచుకొలేక పోతున్నావు ఎందుకు దాచుకుంటారు చెప్పు నేనంటే నికు ఇష్టం అనేది నీ కళ్ళలో నాకు తెలిసి పోతూనే ఉంది దాన్ని అదిమి పట్టాలని చూడకు అంటూ కళ్ళు ఒత్తుకుంటూ బయటకు వెళ్ళింది కవిత ఆంటీ.

ఆమె మాటలకు అవాక్కయిన దినకర్ తన చూపుల్లో అంత అర్దం దొరికిందా అంటూ విస్తు పోయాడు. నేను అసలు ఆ ఆంటీనీ అలా చూడనే లేదు అయ్యో ఆంటీ నీకు అలా అర్దం అయ్యిందా పాపం అంకుల్ నిన్ను సరిగ్గా చూడడు అనే జాలితో చూసిన చూపులను నువ్వు ఇలా అపార్థం చేసుకుంటావు అని అసలు అనుకోలేదు అని మనసులో అనుకుంటూ రెడీ అయ్యి కవిత ఆంటీ తెచ్చిన అన్నం, మునక్కాయ కూర కంచంలో పెట్టుకుని తినసాగాడు దినకర్…

పక్కనుండి చాటుగా దినకర్ తినేది చూసిన కవిత ఆంటీ తిను, తిను బాగా తిను ఇన్ని రోజులు నా నుండి తప్పించుకున్నావు ఇక నా నుండి నువ్వు అసలు తప్పించుకోలేవు. బాగా తిను మంచిగా తిని నా పక్కలోకి రావాల్సిందే, ఇన్ని రోజులు ప్రవర్ఖ్యునిలా నా నుండి తప్పించుకోవాలని అనుకున్నావు. నిన్ను నా నుండి ఎవరు కాపడలేరు అని అనుకుంటూ లోపలికి వెళ్ళింది కవిత ఆంటీ.

దినకర్, కవిత ఆంటీ ఇంట్లో కిరాయికి ఉంటూ ఏదో కొరియర్ బాయ్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఊర్లో చాలా సమస్యలు, బాధ్యతలు ఉండడం వల్ల ఇలా వేరే ఊర్లో ఉంటూ వండుకుని, తింటూ ఒక్కోసారి తినకుండానే డబ్బును దాచి ఇంట్లో వాళ్లకి పంపుతూ ఉంటాడు.

కవ్వింతల ఆంటీ

This contains an image of: {{ pinTitle }}

తన బాధ్యతల వల్ల సరిగ్గా తిండి లేకపోయినా కూడా అతని బాడీ, జిమ్ బాడిలా ఉండడానికి కారణం అతను చిన్నప్పటి నుండి చేసిన కాయ కష్టం వల్లనే… పొలంలో తండ్రికి సహాయం చేస్తూ ఉండడం వల్లే, అతనికి ఆ శరీరం వచ్చింది.

ఇప్పుడు కవిత ఆంటీ కూడా ఇష్టపడేది ఆ కండల వీరుడితో కలవాలనే, ఆ శరీరంతో తన వేడి నీ చల్లబరచాలని ప్రయత్నం చేస్తుంది. కానీ దినకర్ మాత్రం ఆంటీ ఎన్ని విధాల ప్రయత్నం చేసినా కూడా లోంగడం లేదు. దాంతో ఆంటీ ఎవర్నో ఏదో మందు లాంటిది అడిగింది.

అంటే ఊర్లలో కొందరు భర్త తమ మాట వినాలని ఏవేవో మందులు పెడుతూ ఉంటారు కదా అలా అన్నమాట (ఇక్కడ ఇవి ప్రోత్సాహించాలి అని నా అభిమతం కాదు). అలా ఏదో మందు కలిపి ఆంటీ అతనికి మునక్కాయ కూరలో కలిపి పెట్టింది.ఎందుకంటే, పెళ్లి కాక ముందే కవిత చాలా సార్లు కాలు జారింది. ఎన్నో కడుపులు తియించుకుంది. ఆమె అలా మారడానికి తన పేదరికమే కారణం.

మరి తండ్రి తాగుబోతు, తల్లికి అనారోగ్యం ఇంట్లో ముగ్గురు తమ్ముళ్ళ, చెల్లెళ్ల బాధ్యత అంతా చూసుకోవడానికి ఏం చేయాలో తెలియక విధి లేని స్థితిలో తాను కాలు జారింది మొదట. కానీ, అందులోని మజా గుర్తించగానే కవిత దానికి బానిస అయింది.

కొన్ని రోజులకు తన తండ్రికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కవిత ఏమీ భయపడలేదు ఏంటి ఇది అని అడిగిన తండ్రికి తండ్రి తప్పును చూపించడంతో, తండ్రి తన తప్పును తెలుసుకుని తాగుడు మానేసి కవితకు పెళ్లి చేయాలని అనుకున్నాడు.

కానీ, ఆ ఊర్లో కవిత గురించి తెలిసిన ఎవరు ముందుకు రాకపోవడం వల్ల వేరే చోట తమకు దూరంగా రెండో పెళ్లి వాడు అయినా నాగరాజుకు ఇచ్చి చేశాడు.

This contains an image of: {{ pinTitle }}

నాగరాజు దుబాయ్ కి వెళ్లి బాగానే సంపాదించాడు. అతని మొదటి భార్య కానుపు కష్టమయ్యి బిడ్డతో సహా చనిపోయింది. ఇక్కడుంటే అన్ని గుర్తుకు వస్తాయి అని భావించి డబ్బు సంపాదనలో పడ్డాడు. కాని, ఇక్కడ కోరికతో రగిలిపోతున్న కవిత ఆంటీకి ఇది నచ్చలేదు.

కానీ అతన్ని వదిలెయ్యడం మంచిది కాదని డబ్బు సుఖం లో పడిన కవిత ఆంటీకి బాగా అర్దం అయ్యి అతన్ని వదలకుండా తన కోరికలు తీర్చుకునే ప్రయత్నం చేస్తూ, తన ఇంట్లో ఒక గది కట్టించి దాన్ని కేవలం పెళ్లి కానీ మగ పిల్లలకు అద్దెకు ఇస్తూ ఉండేది.

వచ్చిన వాళ్ళను తన మాటల, చేతల, కవ్వింతలతో లొంగదీసుకుంటే వాళ్లను తన కోరిక లు తీర్చుకోవడానికి ఉపయోగించు కుంటు ఉండేది.పెళ్లి అవ్వక ముందు చాలా కడుపులు పోవడంతో ఇప్పుడు కవిత ఆంటీ కి పిల్లలు కలగలేదు.

పెళ్లి అయ్యి నాలుగేళ్లు అయినా నాగరాజు వచ్చినప్పుడల్లా ఇదే విషయం పైన కొప్పడి వెళ్తూ ఉంటాడు కవిత ఆంటీ ని తనకు ఎందుకు పిల్లలు కలగడం లేదని మధన పడిపోతుంటాడు నాగరాజు…

కవిత ఆంటీ అద్దెకు వచ్చిన పిల్లలను లొంగదీసుకొని వారితో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అయితే వాళ్ళు ఆంటీతో రొమాన్స్ అనేసరికి ఎగిరి గంతేసి ఎంజాయ్ చేసినా ఏవో పద్దతులు వాడడం వల్ల తనకు పిల్లలు పుట్టకుండా ఉండేది.కానీ భర్త ఊరికే తిట్టడం వల్ల ఆంటీ కి పిల్లల మీదకు మనసు పోయింది.

కానీ, తన భర్త అందంగా లేడు కాబట్టి తాను అందమైన తనకు నచ్చిన వాడితో పిల్లల్ని కనాలి అనుకుంటుంది. ఎందుకంటే నాగరాజు డబ్బు పై ఉన్న ప్రేమ అతని మీద లేకపోవడం ఒక కారణం, అయితే అతను తన కోరికలు తీర్చకుండా ఉండడం వల్ల అతని మీద పగ తీర్చుకోవాలని ఆంటీప్లాన్.

కాబట్టి ఆంటీ ఇప్పుడు దినకర్ కు ఇల్లు కిరాయికి ఇచ్చి, అతని ద్వారా పిల్లాడిని కనాలని అనుకుంటూ ఉంది. అందుకే దినకర్ తన కవ్వింతలకు దొరకక పోవడం వల్ల ఏదోలా అతన్ని ముగ్గులోకిలాగాలని కూరలో మందు వేసింది..మరి ఆ మందు పనిచేస్తుందా లేదా?

ఆంటీ ఆంటీ ఏం చేస్తున్నావు అంటూ వచ్చ్చాడు దినకర్ ఎన్నడూ ఇలా పిలవని దినకర్ తనను పిలవడం అది కూడా బెడ్ రూమ్ లోకి రావడం చూసి ఏంటి  దినకర్ అని అడిగింది ఏమీ తెలియనట్టు అంటే తన మందు పని చేసిందా అని మనసులోఅనుకుంటూ..

అబ్బా ఆంటీ పనికి వెళ్ళినా కానీ అక్కడ నువ్వే గుర్తుకు వచ్చావు నిన్ను చూడాలని అనిపిస్తుంది నీ వైపు మనసు లాగుతూ ఉంది అందుకే వెంటనే వచ్చాను కానీ ఎన్నడూ లేనిది ఇలా నాకు ఎందుకు అనిపిస్తుంది అంటూ ఆంటీ నీ గట్టిగా కౌగిలించుకున్నాడు దినకర్.

కవ్వింతల ఆంటీ

అబ్బా ఏంటి ఇది దినకర్ అంకుల్ కు తెలిస్తే బాగోదు అంది కవిత, ఎలా తెలుస్తుంది అంకుల్ ఇక్కడ లేడు గా అంటూ కవితని మాట్లాడనివ్వకుండ బెడ్ పైకి తోసాడు దినకర్..

ఇక ఆ రోజు నుండి వారికి ప్రొద్దున పగలు రాత్రి అన్ని ఒకటే అయ్యాయి , దినకర్ ఆంటీ ఇంట్లోనే తిష్ట వేసి ఆమెని చూస్తూ కూర్చునే వాడు, ఆంటీ పెట్టిన మందు వల్ల పూర్తిగా ఆమెకు బానిసల మారాడు దినకర్ అంటే చంద్రముఖి లాగా అన్నమాట.

ఆమె ఏది చెప్తే అది చేయడం ఆమెను వదలకుండా ఉండడం కనీసం ఉద్యోగానికి కూడా వెళ్లకుండా ఉండడం చేస్తూ ఉన్నాడు.

అలా వారి కవ్వింతల కౌగిలిలో మూడు నెలలు ముచ్చటగా జరిగిపోయాయి. ఈ మూడు నెలలు ఉద్యోగానికి వేళ్ళని కారణంగా దినకర్ జీతం రాలేదు తల్లిదండ్రులు డబ్బు కోసం చాలా ఎదిరి చూసారు కానీ డబ్బు పంపని కొడుకు కు ఏం సమస్యలు ఉన్నాయో అనుకుంటూ కాలం గడిపారు.

ఉత్తరాలు ఫోన్ లు చేశారు కానీ కవిత ఆంటీ మాయలో పడిన దినకర్ అవన్నీ ఏమీ పట్టించు కోలేదు.మూడు నెలల తర్వాత కవిత ఆంటీ నెల తప్పింది అని తెలుసుకుని ఆనంద పడింది. ఆ రోజు దినకర్ తో అతన్ని తన వడిలోపడుకోబెట్టుకుని జుట్టు నిమురుతూ ….

దినకర్ అంది ప్రేమగా చెప్పు ఆంటీ అన్నాడు దినకర్ ఆమె కళ్ళలోకి చూస్తూ నేను తల్లిని కాబోతున్న ఇక అంకుల్ కు కూడా విషయం తెలిసింది నన్ను తల్లిని చేసింది నువ్వే, అయినా ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలి అంటే నువ్వు ఇల్లు ఖాళీ చేసి దూరంగా వెళ్లాలి నా కోసం నువ్వు వెళ్లిపోతావు కదూ అంటూ అతన్ని మెంటల్ గా ప్రిపేర్ చెయ్యసాగింది.

అయితే ఆంటీ తల్లిని అని తెలిసాక తనకు మందు ఇచ్చిన ఆవిడ దగ్గరకు వెళ్లి విరుగుడు మందు అంటే ప్రేమగా ఉన్న అతన్ని మళ్లీ మామూలుగా చెయ్యడం కోసం వెళ్ళింది కానీ ఆ ముసలావిడ చనిపోవడంతో విరుగుడు మందు తెలేక పోయింది అందువల్ల నా మాట వింటాడు అనే విషయం తెలిసి అతన్ని ఇప్పుడు తనకు దూరంగా పంపాలి అనుకుంటూ దినకర్ ను సిద్దం చేస్తుంది .

అమ్మో నిన్ను వదిలి వెళ్ళాలా నేను వెళ్ళను నీతోనే ఉంటాను అన్నాడు దినకర్ చిన్న పిల్లాడిలా… నువ్వు ఇక్కడే ఉంటే అంకుల్ నన్ను వదిలేస్తాడు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండకూడదు వెళ్లిపోవాలి మళ్లీ నీ ఉద్యోగం చూసుకుని ఉండాలి మీ ఊరికి నువ్వు వెళ్ళిపో సరేనా అంది కవిత.

ఆంటీ లేదు నేను పోను నీ దగ్గరే ఉంటా నాకు నువ్వే కావాలి నీతోనే ఇక్కడే ఉంటాను  నేను పోను అంకుల్ వచ్చినా ఎవరు వచ్చిన సరే నేను పోను అన్నాడు మొండిగా ..

దాంతో ఆంటీ కి భయం వేసింది రేపు భర్త వస్తె తన బండారం బయట పడితే తన పరిస్థితి ఏంటో కళ్ళకు కట్టినట్టు గా కళ్ళ ముందు సాక్షాత్కరించింది. దాంతో వెన్నులోంచి వణుకు వచ్చింది కవిత ఆంటీకి.

ఎలాగైనా వీడిని వదిలించుకోవాలి లేదంటే నన్ను వదలడు వీడు విరుగుడు మందు ఎలాగైనా సంపాదించాలి కానీ ఎలా కొన్ని రోజుల్లో భర్త వస్తున్నట్టు గా ఉత్తరం రాయడం వల్ల చాలా తొందరగా వీడిని వదిలించు కోవాలి అని అనుకుంటూ దినకర్ తల్లిదండ్రులకు ఉత్తరం రాయించింది వెంటనే రమ్మని…

ఇంటి యజమాని ఇలా ఉత్తరం రాయించడం చూసి ఆ తల్లిదoడ్రులిద్దరూ చాలా కంగారు పడుతూ ఏం అయ్యిందో తెలియక ఆదరాబాదరాగా ఆఘమేఘాల మీద వచ్చారు ఏంటో అనుకుంటూ వాళ్ళు వచ్చేసరికి దినకర్ నీ ఒక గొలుసుతో తన ఇంట్లో కుక్క పిల్లలా కట్టేసిన కవిత ఆంటీ దినకర్ కు ట్రైనింగ్ లాంటిది ఇచ్చింది.

మీ వాళ్ళతో వెళ్ళు నేనే వస్తాను నువ్వేం మాట్లాడకు అంటూ బాగా బుర్రలో నింపడం వల్ల ఆంటీ మాయలో పడిన దినకర్ అలాగే అంటూ ఆమె ఏం చెప్పినా చేసినా చూస్తూ ఉండి పోయాడు.

ఇక దినకర్ తల్లిదండ్రులు రాగానే కవిత ఆంటీ ఏడుస్తూ మీ అబ్బాయి నన్ను ఒక్కతిని చేసి నోట్లో గుడ్డలు కుక్కి నా పై చాలా రోజులుగా మానభంగం చేశాడు.

ఫలితంగా నాకు కడుపు వచ్చింది ఎలాగో తప్పించుకుని ఈ రోజు ఇదిగో ఇలా కట్టేసాను మీకు ఉత్తరం రాయించాను నాకు వచ్చిన కడుపును పోగొట్టుకొలేను నా భర్త వస్తాడు అతనికి తన బిడ్డని చెప్తాను.

కానీ మీ కొడుకు నాకు అన్యాయం చేసిన సంగతి నా భర్త కు తెలిస్తే చంపేస్తాడు కాబట్టి నేను మీ అబ్బాయి సంగతి ఎవరికీ చెప్పను మీరు కూడా ఎవరికీ చెప్పకుండా అతన్ని తీసుకుని వెళ్ళండి

నాకు పిల్లాడు పుడతాడు కాబట్టి నేను మీ కొడుకు విషయాన్ని మా ఆయనకు చెప్పడం లేదు మీరు కూడా అతను మళ్లీ నా జోలికి రాకుండా చూసుకోవాలి, కడుపులో బిడ్డను చంపుకొలేని ఒక తల్లిగా , నా జీవితాన్ని మీరు కాపాడాలి అంటూవారిని తన మాటలతో మాయ చేసేసరికి నిజంగానే తమ కొడుకు ఇలా చేశాడని నమ్మక, నమ్మాలో లేదో కూడా తెలియని స్థితిలో వాళ్ళు తలలు ఉపారు.

మరి డబ్బున్న వాళ్ళతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి ఏమీ అనలేక నోరు మూసుకొని కవిత చెప్పిన మాటలకు తలలు ఊపి ఊరుకున్నారు.

కవిత వారికి ఒక లక్ష రూపాయలు ఖర్చుకి ఇచ్చి, గొలుసులతో ఉన్న దినకర్ ను వదిలేసింది. కానీ దినకర్ కవిత దగ్గరికి వచ్చి కౌగిలించుకుంటూ కవిత, కవిత అనడం చూసిన తల్లిదండ్రులిద్దరూ బలవంతంగా వస్తున్న కన్నీళ్లను తుడుచుకుని దినకర్ ను బయటకు తీసుకుని వెళ్లారు.

కవిత ఆంటీ తన కోరిక తీరినందుకు తన కడుపు పండినందుకు తన తీరని కోరిక తీర్చుకున్నందుకు, తనకు లొంగని వాడిని లోంగదీసుకుని తన కోరిక తీర్చుకుంది అనే సంతోషం లో భర్త కోసం రకరకాల వంటలు చేసి తెగ సంతోషం లో ఉంది కవిత ఆంటీ….

ఇక అక్కడ దినకర్ మందు బాగా ముదిరి పోవడం వల్ల కవితా, కవితా అంటూ ఊరంతా తిరుగుతూ, పిచ్చి పట్టిన వాడిలా కవితా, కవితా అని బట్టలు చింపుకుంటున్నాడు. చేతికి అంది వచ్చి కుటుంబాన్ని పోషిస్తున్న కొడుకు ఇలా ఒక ఆంటీ కోసం పిచ్చివాడిలా అవ్వడం చూసి అతన్ని ఎన్నో ఆసుపత్రుల్లో చూపించినా ఫలితం లేక పోవడం.

కవిత ఇచ్చిన లక్ష రూపాయలు దినకర్ మందులకు నీళ్ళలా ఖర్చు అవ్వడంతో ఏమీ చేయాలో ఇంకా అతన్ని ఎలా బాగు చేయాలో తెలియక అతన్ని పట్టుకుని కూర్చుంటే మిగతా వారి జీవితం నాశనం అవుతుందని తెలిసి, అతణ్ణి ఏమీ చేయలో తెలియక వదిలేశారు .

Story Pin image

ఎన్ని సార్లు కట్టేసినా తెంచుకుని వెళ్లిపోవడం తో ఇంకేం చేయలేక దినకర్ ను పట్టించుకోవడం మానేశారు…

అందమైన యువకుడి జీవితం లో ప్రవేశించి, అతను లొంగకపోవడంతో లోంగదిసుకోవాలని ఒక పిచ్చి మందును అతనికి పెట్టీ అతన్ని తన మాయలో పడేసి కోరికలు అన్ని తీర్చుకుని, అతని ద్వారా కడుపు తెచ్చుకుని, తిరిగి బాగు చేసే మందు దొరక్క పోవడంతో, అతని పండంటి  జీవితాన్ని నాశనం చేసి, లక్ష రూపాయలతో తన తప్పును కడిగేసుకుంది.

కానీ దినకర్ బాగుంటే లక్ష రూపాయల కంటే ఇంకా ఎక్కువ సంపాదించే వాడు ఇంకా తన కుటుంబాన్ని బాగు చేసుకునేవాడు. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆనందంగా జీవించేవాడు.

ఉన్న ఒక్క కొడుకుని ఉద్యోగం చేసుకుని తమ బాధ్యతలు తీర్చి, మలి వయసులో తమకు అండగా పెళ్లి చేసుకుని మనవల్ల ను ఇస్తే వారితో ఆడుకుంటూ తమ చివరి కాలాన్ని తృప్తిగా గడపాలి అనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు అన్ని వ్యర్థం అయ్యాయి. వారి ఆశలు నిరాశలు అయ్యాయి.

తుచ్ఛమైన అయిదు నిమిషాల సుఖం కోసం ఒక కుటుంబాన్ని, కొందరి జీవితాలను, కొందరి ఆశలను, ఆశయాలను చంపేసి, తనకు పుట్టిన దినకర్ కొడుకే నీ కొడుకు అని భర్తను, సమాజాన్ని మోసం చేసిన కవిత ఆంటీ కేవలం దినకర్ తనకు లొంగ లేదని పిచ్చి మందును వాడడం, అతని జీవితాన్ని నాశనం చేయడం ఒప్పంటారా? తన జీవితం బాగుండాలి అని కోరుకోవడం స్వార్థం అయితే ఇలా ఒక కుటుంబంను నాశనం చేయడాన్ని ఏమంటారు?

ఈ కథ వల్ల నేను చెప్పాలి అనుకుంటున్నా నీతి ఏమిటి ?

మగవాడు అయినా, ఆడవాళ్ళు అయినా, ఇలా విపరీత ధోరణులు ఇప్పుడు అలవర్చుకుని తమ స్వార్థం కోసం క్షణిక ఆనందం కోసం ఇతరుల జీవితాలను నాశనం చేయడానికి రెడీగా ఉన్నారు.

అందరూ అలా ఉన్నారా అంటే ఏమో చెప్పలేము ఎవరు, ఎప్పుడు ఎలా మారతారో ఎవరికీ తెలియని కాలం ఇది. కాబట్టి, ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు అయినా, మగాళ్లు అయినా ఇలాంటి ఆంటీల వలలో పడకుండా ఉండాలని చేసేదే నా ఈ చిన్ని ప్రయత్నం..

ఇది చదివి ఒక్కరూ అయినా అలాంటి వాటి నుండి తప్పించుకుంటారని ఈ నా కథ రాయడం జరిగింది.. ఈ కథలోని పాత్రలు, పేర్లు అన్ని కల్పితమే నా చిన్నప్పుడు మా ఇంటి చుట్టుప్రక్కల వాళ్ళు చెప్పుకుంటూ ఉండేవారు కొద్ది మార్పు తో దీన్ని రాయడం జరిగింది..

Square cut-out blouse design!! #blousedesign #saree #indian #designer #indianbride #Modern #stylish #indianweddings

ఇప్పుడు భార్య భర్త వశీకరణం అంటూ టీవీ ల్లోనూ, పేపర్ లోనూ వచ్చే స్వామీజీలు ఇచ్చే మందుల వల్ల ఎలాంటి ఫలితాలు ఉండవు. పైగా ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఎవర్నీ నమ్మకండి ఎవరి వలలో పడకండి..

ఇవ్వన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీలో ఒకరు అయినా జాగ్రత్త పడతారు అనే నా ప్రయత్నం .. తస్మాత్ జాగ్రత్త…కవిత ఆంటీ వల్ల ఒక కుటుంబం నాశనం అయింది కానీ కవిత ఆంటీ ఇప్పుడు తన బిడ్డతో, భర్త తో ఆనందంగా సంతోషంగా ఉంది…

(ఈ మందులు పెట్టడం వారికి వాళ్ళు గుర్తు రావడం, అమే మాయలో పడడం అనేవి పూర్వకాలం లో జరిగేవి , కొన్ని పాత సినిమాల్లో చూపించినట్టు గుర్తు, అలాగే ఇవి పెట్టిన కొన్ని రోజులకు మనుషులు వారి అధీనంలో  ఉంటారు ప్రేమ పెరుగుతుంది .కొన్నాళ్లకు ఆ మందు ప్రభావం తగ్గి మామూలు గా అవుతారు, ఇప్పటికీ ఉన్నాయి అనే నమ్మేవాళ్ళు కొందరు, లేవు అదంతా ట్రాష్ అని అనేవాళ్ళు కొందరు ). మూఢనమ్మకాలని ప్రోత్సహంచడం నా అభిమతం కాదు కేవలం కథలకు మాత్రమే తీసుకోవడం జరిగింది.

Related Posts

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *