కెవ్వుకేక

కెవ్వుకేక

కమల కాలేజ్ కి వెళ్తోంటే అందరూ వింతగా చూసేవారు. ఎందుకో అర్థమయ్యేది కాదు కమలకి.

చిన్నగా ఫ్రెండ్స్ అందరూ కూడా దూరమవ్వటం మొదలు పెట్టారు.

ఎందుకో మరి అనుకుంటూ ,ఇంటికొచ్చే సరికి కమల మేనమామ ఏం లడ్డూ !ఎలా ఉన్నావ్ ?
అనేసరికి అప్పుడు తోచింది కమల బుర్రకి .

ఈ ఊబకాయం ఇన్ని అనర్ధాలకీ మూలమన్న మాట అని.

కమల తన ఊబకాయం
ఎలా తగ్గించుకోవాలా అని
ఆలోచిస్తోంటే జీ టీవీ లో డా మంతెన గారి ఆరోగ్యాలయం ప్రోగ్రాం వస్తోంది.

ఇంత వరకు తన ఆరోగ్యం మీద,శరీరం మీద
ఆలోచన పెట్టని కమలకు
ఆ ప్రోగ్రాం బాగా ఆకర్షించింది.

మీ ఊబకాయాన్ని తగ్గించుకోవాలంటే మీ చేతుల్లోనే ఉంది అన్న డా మంతెనవారి మాట ఆకట్టుకుంది.

నీరు ఎక్కువగా త్రాగండీ,తేనె నిమ్మరసం గోరువెచ్చని నీటిలో కలుపుకుని ఉదయం ఒక గ్లాస్ త్రాగండి. మొలకలను బ్రేక్ ఫాస్ట్ గా తినండి.నూనె,ఉప్పు తగ్గించండి. మధ్యాహ్నం
ఒక పుల్కా,కప్పుడు పెరుగన్నం తినండి. రాత్రి
పళ్ళ ముక్కలు,డ్రైప్రూట్స్
సాయంత్రం ఆరు గంటల లోపు ఆహారంగా తీసుకోండి.

శరీరాన్ని వ్యాయామం తో వంచండి.ఆసనాలు,ప్రాణాయామం,వాకింగ్ కూడా ఈ ఊబకాయాన్ని తగ్గించుకోవటానికి ఉపయోగపడతాయి. ఫాస్ట్ ఫుడ్స్,జంక్ ఫుడ్స్ మర్చేపోండి. ఇంట్లో ని ఆహారము ఆరోగ్యానికి మంచిది . ఇలా చేస్తే ముప్ఫై రోజులలో స్మార్ట్ గా తయారవుతారు అన్న మంతెన గారి ఉవాచ కమలకి బాగా నచ్చింది.

వెంటనే అలా చెయ్యాలని దృఢ సంకల్పం పెట్టుకుంది. చాలా స్మార్ట్ గా ముప్ఫై రోజుల్లో తయారయ్యింది.

నెల రోజుల క్రితం ఊబకాయం అని వెళ్ళిపోయిన పెళ్ళి కొడుకు
రఘు ,వాట్స్ ప్ లో కమల ఫోటో చూసి ఆ రామాపురం సంబంధం అమ్మాయి కమలని నేను చేసుకుంటాను నాన్న అన్నాడు. కమలకి కూడా
మంచి ప్యాకేజ్ ,అందం ఉన్న రఘు ఇష్టపడే సరికి
కెవ్వుకేక అని ఒక కేక పెట్టింది.

– రుద్రపాక సామ్రాజ్య లక్ష్మి

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *