కార్ఖనా లో రెండో రోజు కథ వేరే ఉంటది

కార్ఖనా లో రెండో రోజు కథ వేరుంటది.

 

మా అత్త తో నేను ఖార్ఖాన కు వెళ్లిన మొదటి రోజు ఏం జరిగిందో చెప్పాను కదా మరి రెండో రోజు కూడా ఇంకేం అవుతుందో చూద్దామని ఆశగా వెళ్ళాను మరి బీడీలు పక్కన పారేసినవి ఎమి చేస్తారో తెలుసుకోవాలి గా అందుకే మళ్లీ వెళ్ళాను నేను  నాకు ఇలాoటి విషయాలు చాలా ఇష్టం కాబట్టి మా అత్తతో కలిసి వెళ్ళాను.

అయితే ఈ సారి ముందులా కాకుండా అంటే బాగా మంచి గౌను వేసుకుని కడుపునిండా తినేసి ఈ సారి కరం కాదు మామిడికాయ తొక్కు అన్నం తినేసి ఇద్దరం వెళ్ళాం నేను మాతో వస్తున్న వారిని గమనిస్తూ వెళ్తున్నా అందరూ సద్దనం తినేసి భర్తలకు సద్ది కట్టి పొలానికి పంపేసి పిల్లలకు ఇల్లును అప్పగించి గంపలు పట్టుకుని బయలుదేరారు.

ముచ్చట్లు పెట్టుకుంటు అన్ని వాళ్ళ కుటుంబాల గురించీ వంటల గురించి కాకుండా ఊర్లో సంగతుల నుండి జిల్లాలో ఏం జరుగుతుంది ఎవరూ ఎలా మాట్లాడుతున్నారు ఎవరెవరికి ఎవరితో అక్రమ సంభందాలు ఉన్నాయో వరకు అన్ని మాట్లాడుతూ ఉన్నారు.

అవి నేను ఆసక్తిగా వింటున్నా కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఆడవాళ్ళకు అన్ని తెలుసు ఒక్క అయిదునిమిషాల వారితో కూర్చుంటే దేశం లో ఏం జరుగుతుందో  తెలుసుకోవచ్చు అని అప్పుడు నాకు అంత ఊహ లేదు కాబట్టి ఆ ఆలోచన అప్పుడు రాలేదు.

ఇక ఇప్పుడు చదువుకొని వాళ్ళు అలా మాట్లాడితే ఇక ఇప్పుడు చదువుకున్న మనం ఎంత డిస్కస్ చేయాలి ఎంత మాట్లాడాలి చెప్పండి ..

సరే టాపిక్ ఎక్కడికో వెళ్తుంది కదా సరే ఇక మన ముచ్చట్ల లోకి వస్తె అందరం కలిసి ఖార్ఖానా కు వెళ్ళాం అక్కడ ఎప్పటిలా గోల గోల గా కాకిరి బికిరి ముచ్చట్లలో హడావుడిగా ఉంది.

తంబాకు వాసన తో అంతా కలగాపులగంగా కంగలిగా గడబిడ గా ఉంది. అయితే మనకు కావలసిందే బీడీలు ఏం చేస్తున్నారు అని కదా అయితే మెల్లిగా నేను సాయిబు దగ్గరికి వెళ్ళాను వారి గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇక వెళ్లి అతని పక్కన నిల్చున్నాను.

making beedis | Beedis are little hand rolled cigarettes pop… | Flickr

నేను ఇలా వెళ్ళి చూడడానికి కారణం ఏంటంటే మా అత్త చాల బాధపడింది అందుకే చూద్దామని వెళ్ళాన అక్కడ నిలబడి వేరే వాళ్లకు బీడీలు తెంపుతు  ఉంటే చూస్తున్నాను అయితే అతను బీడీల గంప రాగానే వాటిని ఒక్కసారి పట్టుకుని చూసి అన్నిటిలోకి కాస్తా మంచిగా ఉన్నవాటిని అంటే గుండ్రంగా వచ్చిన కట్టిన బీడిలను తింపుతి ఇంకొక పెద్ద గంపలో వేయడం చూశాను.

గంప ముందుకు పెట్టిన వాళ్ళు అయ్యో గట్ల తెంపుతూ మంచిగానే ఉన్నాయి కదా అని అంటూ గంపలో చేయి పెట్టీ కొన్ని తీసుకుని అక్కడే మళ్లీ సుద్రయించడం మొదలు పెట్టారు.

కానీ అతను మాత్రం నేను మల్ల కడితే తీసుకొను అంటూ చెప్తున్నా కొందరు చాటుగా కడితే ఇంకొందరు అతనితో గొడవ పడుతున్నారు అయితే అతను ఒక్కొక్కసారి బీడిలను విసిరి కొడుతూ మూతి మంచిగా రాలే తోక పోయింది అంటూ వాటిని కచ్రగ తీసేయడం చేస్తున్నాడు.

కొందరు తిడితే పాత వాళ్ళు తిడుతుంటే కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు ఏం అనడం లేదు మరి ఇక మా అత్త కూడా గంప పెడితే రెండు వందలు తెంపేసాడు  మా అత్త ఏం అనకుండా గంప తీసుకుని పక్కన నిలబడింది.

ఇక అందరివీ అయ్యాక కార్డుల మీద రాసి ఇచ్చేస్తు మాట్లాడుతూ వాళ్ళ పర్సనల్ విషయాలు అడుగుతూ జోక్స్ వేస్తూ అందులో బూతు జోకులే ఎక్కువ దాన్ని వింటున్న వాళ్ళు శి గలిసు అంటూనే ముచ్చట పడుతున్నారు.

File:Beedi making as handicraft.jpg - Wikimedia Commons

అతని మాటలకు సిగ్గు పడుతూనే వింటున్నారు .ఆ తర్వాత అవన్నీ అయ్యాక కొందరు వెళ్ళాక ఎను అక్కడే ఉన్నాను అయితే మా అత్త నన్ను తీసుకుని వెళ్తా అంటే అత్త నేను. యదవ్వ తో వస్తాను అని చెప్పాను.

యాదవ్వ మా నాన్నమ్మ వాళ్ళింటి పక్కనే ఉంటారు ఇక నేను ఆమెతో వస్తాను అని అనగానే మా అత్త వెళ్ళిపోయింది ఇంటికి అప్పటికి మధ్యాహ్నం అవబోతుంది ఇంకా నేను అతన్ని చూస్తూ ఉన్నాను దాదాపు అందరూ వెళ్ళిపోయారు.

నేను యాదవ్వ దగ్గర కూర్చుని చూస్తున్న ఇంతలో సాయిబు ఆ బుట్టలో వేసిన బీడీలు తీసుకుని వచ్చి అక్కడ కూర్చున్న ఆడవాళ్ళ చాటల్లో వేశాడు అవన్నీ మళ్లీ మంచిగా సెట్ చేశాక వాళ్ళు వేరే కలర్  దారం తో అన్ని కట్టలు కట్టేసి గoపల్లో నింపడం మొదలు పెట్టారు నేను ఆమెను అడిగాను ఇవ్వన్నీ పనిచేయవు అన్నాడు కదా మళ్లీ వేరే దారం ఎందుకు అని అడిగితే ఆమె ఎం చెప్పిందంటే.

వాని బొంద ఇంత మంచిగా ఉన్న వాటిని మల్ల మంచిగా కట్టించి తక్కువ రేటు కు అమ్ముకుంటాడు  ఈ పైసలు వాడె  తీసుకుంటాడు. మా రెక్కలు అన్ని పొంగ చేస్తే సగానికి మూడువాల్లు వీడే దొబ్బుతడు అని తన అక్కసు వేళ్ళ గక్కింది  యాదవ్వా ..

అప్పుడు నాకు నిజం తెలిసింది వీళ్ళు ఇంత కష్టపడి బీడీలు చేస్తే మంచిగా ఉన్న వాటిని కచ్రా అని పారేసి తెంపేసి అతను అమ్ముకోవడం డబ్బులు కోయడం దీని వల్ల వాళ్ళ కష్టాన్ని శ్రమను దోచుకుంటున్నారు అని అనిపించింది.

నాకు అయితే ఇదే విషయాన్ని సాయిబు మాటల్లో ఇంకో రకంగా వినడం జరిగింది అదేంటి అనేది ఇంకొక పార్ట్ లో చెప్తాను మరి ఇంకా ఉండనా.. సెలవ్ …                                                                                                                      – భవ్య చారు

Related Posts

2 Comments

  1. బీడీ కార్మికులపై ఖర్కానా దళారులు చేసే శ్రమ దోపిడీని గురించి చక్కగా వివరించారు.పరిష్కారం పోరాటం వైపు తీసుకువెళ్తారని ఆశిస్తున్నా.
    Madam congrats.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *