కోటి విద్యలు కూటి కొరకే

కోటి విద్యలు కూటి కొరకే

 

కోటి విద్యలు కూటి కొరకే. పండితుడైనా,పామరుడైనా
వృత్తి ధర్మం నెరవేర్చాల్సిందే.
ఉదరపోషనార్ధం తమ వృత్తిని
కొనసాగించవలసినదే. ఖాళీగా
కూర్చుని తింటే కొండలైనా కరిగి
పోతాయి. ఇతరులను మోసం
చేయకుండా ఏ పని చేసినా తప్పు లేదు. వృత్తి ధర్మాన్ని
పాటించేవారికి అపజయం
ఉండదు. పండితుడు కూడా
పామరుడి సహాయం లేకుండా
జీవితంలో ముందడుగు వెయ్యలేడు. అది అక్షర సత్యం.
సమాజంలో అందరూ తమ తమ పనులు సమర్ధవంతంగా
చేస్తే ఆ సమాజం తప్పక అభివృద్ధి చెందుతుంది.

-వెంకట భానుప్రసాద్

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *