కొత్త చిగురు కోసం

కొత్త చిగురు కోసం

పండుటాకు రాలిపోయే,

కళకళలు నింపటానికి నా ఎదలో

ఆశలు చిగురించినాయి,

మధుమాస కోయిలలు పలకరించినాయి…

మోడుబారి పోయిన బ్రతుకులలో మోజులు పుట్టించాయి…
ఆశలు నాలో రేకెత్తించినాయి..

ఆకుల పచ్చదనం ప్రకృతికి పర్వదినం…

ఆశల పల్లకిలో దారి పొడుగునా

అడుగడుగునా ఎడారి ఆవిరి అయినా,

మావి చిగురు పూత కోసం ఎదురుచూపులు….
నా మనసున రేగే ఆశలకు అవి

ఆలవాలం కావాలని కోరుతున్న…

– పలుకూరి

Related Posts