కొత్త దారి

కొత్త దారి

విశ్వాసం లేని నాయకులు
డబ్బు రుచి మరిగిన ఓటర్లు
ఆ కాసులని వెదజల్లుతూ
బీరు, బిర్యానీలు పంచుతూ
ఓటుకు నోటును అందిస్తూ
జనాలను పీడిస్తూ, పిచ్చి వారిని చేస్తూ
పిల్లలతో మీటింగ్ లు ఏర్పాటు చేస్తూ
యువతకు గంజాయి అలవాటు చేసి
మత్తులోకి పంపుతూ, తాము చెప్పిందే వేదం
పాలన లోకి వస్తె ఎన్నో చేస్తామని అంటూ
దెయ్యాలు వేదాలు వాల్లించినట్టు జనాలను
మోసం చేసి, బిర్యానీ బీర్లు అందగానే ఆ మైకం
లో పడుతున్న జనం తామేం చేస్తున్నారో మరచి
చెప్పే మాటలకు పొంగిపోయి అధికారం అందిస్తే
ఉన్నవన్నీ అమ్మేసి, తలా కొంత పంచుకుని, కబ్జాలు
చేస్తూ, బ్యాంకుల్లో ములుగుతున్న నల్లధనాన్ని
ఇంకా పెంచుకుంటూ, జనాల పైకి పన్నులు ఎగదోస్తు ఉంటే
మైకం దిగిన జనం, అన్ని అర్దం చేసుకుని,

మరో కొత్త దారి కోసం వెతుకుతూ, తాము చేసిన తప్పును సరిదిద్దాలి అని
కంకణం కట్టుకుని, ఎవరో వచ్చి తమ కష్టాలు తీరుస్తారనీ
కొండంత ఆశతో, వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూoటే…
మరి రాదా వారి జీవితం లో వెలుగు.???

– భవ్య చారు

Related Posts