కొత్త జీవితం

కొత్త జీవితం

హాయ్ చరణ్ ఎలా ఉన్నావు? ఏంటి ఇన్ని రోజులు లీవ్? పెళ్లి ఎప్పుడో అయిపోయిందిగా, హనీమూన్ వరకు రావద్దని అనుకున్నావా ఏంటి? అంటూ గలగలా మాట్లాడుతున్న పల్లవిని చూస్తూ అమ్మ తల్లి నువ్వు ఆపితే నేను ఆన్సర్ చెప్తా.. లేదా, నీకు నచ్చినట్టు అనుకో మరి అన్నాడు.

అలిగినట్టు మూతి పెడుతూ, ఐ యాం సారీ చెప్పు చెప్పు ఏంటి సంగతి చెప్పు అంది పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంటూ.

మా బామ్మకు ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల ఇన్ని రోజులు ఉండాల్సి వచ్చింది. ఓ అవునా మరి నీ వైఫ్ ని తీసుకు వచ్చావా లేదా? మాకు చూపించవా? అని నవ్వుతూ అడిగింది పల్లవి. చూపించకుండా ఎలా ఉంటాను చూపిస్తాను కానీ రెండు రోజులు ఆగాలి అన్నాడు.

Page 5 | Royalty-free marriage photos free download | Pxfuel

రెండు రోజుల ఎందుకు అంది ఆశ్చర్యంగా ఎందుకంటే రెండు రోజుల్లో మీకు పార్టీతో పాటుగా నా భార్యని కూడా పరిచయం చేయబోతున్న అని అన్నాడు చరణ్ నవ్వుతూ… ఓ అవునా వాట్ ఏ సర్ప్రైజ్! అయితే నువ్వు ఇచ్చే పార్టీకి తప్పకుండా వస్తాను నీ వైఫ్ ని చూడడానికి, మరి నేను వెళ్తాను, లేట్ అయ్యింది అని మావారు అంటారు అంటూ లేచింది పల్లవి.

నేను వస్తాను పద నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి తాను ఇంటికి వెళతాను అని అన్నాడు చరణ్ ల్యాప్టాప్ మూస్తూ.. వద్దులే నేను బస్సులో వెళ్తాను  చరణ్ అంది పల్లవి.

ఏంటి? ఏమైనా ప్రాబ్లమా? డ్రాప్ చేస్తా అంటే వద్దు అంటావు అన్నాడు. నీ మంచితనం నాకు తెలుసు కానీ నా భర్తకు తెలియదు కదా బాస్! కొన్ని జీవితాలు అంతే అంది నిట్టూరుస్తూ సరే నీ ఇష్టం అంటూ ఆమెతో పాటు నడిచాడు.

అయిదు అంతస్థులలో ఉన్న ఆ భవనంలో ఒక సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు వారిద్దరు. ఈ మధ్యనే పెళ్లి అయింది వాళ్ళ ఉద్యోగులు ఎవరు అతను పెళ్లికి వెళ్లలేకపోయారు. అందుకే పార్టీని రెండు రోజుల్లో ఇవ్వబోతున్నాడు అందరికీ కలిపి.

చరణ్ చాలా మంచివాడు, ఏ దురలవాట్లు లేవు. లవ్, ఎఫైర్ లాంటివి ఏవి లేవని తెలుసుకొని అతనికి ఆశ సంబంధం వచ్చింది కానీ, కాలేజీ రోజుల్లో లత అనే అమ్మాయిని ప్రేమించాడని, తనకోసం బెంగ పెట్టుకొని చివరికి మర్చిపోలేక కొన్ని రోజులు దేవదాసుగా కూడా మారాడు అనే సంగతి అతని స్నేహితుడు వాసుకు తప్ప ఎవరికీ తెలియదు.

ఇకపోతే ఆశ సాంప్రదాయకమైన కుటుంబంలో పుట్టిన ఈ కాలం అమ్మాయి ఎంటెక్ చేసిన లవ్ అంటూ కన్నవారిని బాధపెట్టకుండా వాళ్లు చూసిన సంబంధాన్ని చేసుకుని తల్లిదండ్రుల కళ్ళలో ఆనందాన్ని చూడగలిగింది.

ఆ అమ్మాయి ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడదు తన పని తాను చేసుకుంటూ వెళుతుంది తప్ప ఎవరి జోలికి వెళ్లదు. ఇక చరణ్ కి కూడా పెళ్ళిచూపుల్లో చూడగానే నచ్చేసింది దాంతో రెండో మాటకు అవకాశం లేకుండా ముహూర్తంలోనే నాలుగు మాటలు మాట్లాడి చేసుకున్నాడు.

Page 3 | Royalty-free newlywed photos free download | Pxfuel

పెళ్లైన రోజు సాయంత్రమే అతని బామ్మ మనవడి పెళ్లి చేసిన ఆనందంలో గుండె కాస్త వేగంగా కొట్టుకుని అందర్నీ కాస్త భయపెట్టింది, దాంతో శోభనం కాస్త వెనుకబడినా వారం రోజులకు బామ్మ లేచి తిరగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు లేదంటే ఆశ వచ్చిన వేళా విశేషం బాగాలేదు అనుకునేవారు.

అందరూ ఆ ఏడుకొండల వాడికి మొక్కుకున్నారు దాని ఫలితంగానే చరణ్ ఆఫీసులో చేరడం తల్లిదండ్రులతో కలిసి మొక్కు తీర్చుకోవడానికి తిరుపతికి వెళ్లడం జరిగింది.

కొత్త జీవితం

ఆశ రాగానే మొదట శోభనం ఆ తర్వాత పార్టీ అని ప్లాన్ చేసుకున్నాడు చరణ్ ఆలోచనలోంచి బయటకు వచ్చిన చరణ్ కి తన ఫ్లాట్ తలుపులు తీసి ఉండడం చూసి ఆశ్చర్యపోయి తాళం తీయకుండా ఎలా ఎవరు తీశారు కొంపదీసి దొంగలు పడ్డారా ఏంటి అనే అనుమానంతో లోనికి వెళ్ళాడు .

అల్లుడుగారు ఏంటి ఇంత లేటు మేము వచ్చి చాలా సేపు అయింది అన్నారు మామ గారు అప్పుడు అర్థమైంది చరణ్ కు ఎందుకైనా మంచిది అని తాను ఆశకి తాళాలు ఇవ్వడం వల్లనే వాళ్ళు ఇంట్లోకి వచ్చి ఉంటారని ఇంతలో అతని ముక్కు కు కమ్మని వాసనలు చేరడంతో కడుపులో ఆకలి విజృంభించింది.

ఓహ్ మామగారు వచ్చి చాలా సేపు అయిందా బాగున్నారా అంటూ పలకరించాడు బాగున్నాం బాబు మీరు కులాసాగా ఉన్నారా సరే ఫ్రెష్ అయ్యి రండి భోజనం చేద్దాం అన్నారు సతీష్ గారు పది నిమిషాల్లో తయారై వస్తాను అంటూ బెడ్ రూం లోకి వెళ్ళాడు చరణ్.

మనసులో నవ్వుకుంటూ తాను అనవసరంగా టెన్షన్ పడింది గుర్తొచ్చి తలుచుకుంటూ స్నానం చేసి వచ్చేసరికి టేబుల్ మీద వేడి వేడి భోజనం రెడీ గా ఉంది ఇన్ని రోజులు బయట హోటల్ భోజనం తిని నాలుక రుచి కోల్పోయింది చరణ్ కి ఈ వేడి భోజనం అమృతం అనిపించి తినడంలో మునిగిపోయాడు .

కొంచెం కడుపులో పడగానే ఆశ గుర్తు వచ్చి చుట్టూ చూశాడు ఆశ కోసం కిచెన్ లోకి చూసాడు నీడలాగా కనిపించింది అతనికి అబ్బా పెళ్లయి ఇన్ని రోజులు గడుస్తున్న ఇంకా సిగ్గేనా కాస్త ముందుకు వచ్చి కనిపించవచ్చు కదా అని అనుకున్నాడు మనసులో.

Page 3 | Royalty-free newlywed photos free download | Pxfuel

అతను తినడం ఆపడం చూసి అత్త గారు నవ్వుకుంటూ ఆశ కాస్త నెయ్యి తీసుకురా అమ్మ అంటూ పిలిచింది ఆశ తల్లి సరోజ,  నెమ్మదిగా వచ్చిన ఆశ కొంటె  కళ్ళ క్రీగంట చూపులతో అతన్ని ఒక సారి చూసి మళ్ళీ తల వాల్చేసింది సిగ్గుతో బాగున్నావా ఆశ అన్నాడు మెల్లిగా అత్తగారు తప్పుకోవడం చూసి మీరు అంది చూడు నువ్వు లేవన్న బెంగతో చిక్కి పోయాను నన్ను విడిచి ఎందుకు వెళ్లావు ఇక ఎక్కడికి వెళ్ళకు అన్నాడు.

ఆ సరేనండి అని నవ్వుతూ అబ్బా ముత్యాల రాలిపోయాయి వెతుక్కోవాలి అన్నాడు కిందకి చూస్తూ అంత లేదు కానీ తినండి ముందు అన్నం చల్లారి పోతుంది సరే గాని మరి అదే ఎప్పుడు అని అడిగాడు ఆశని !

ఏది అంది ఆశ తెలిసి తెలియనట్టుగా ఏది అని అంటూ మెల్లిగా అడిగావు ఏంటి అదే మన శోభనం మరి మనకు అది చేయాల్సింది పెద్దలే కదా అన్నాడు చిరునవ్వు తో  తెలియదు అంది ఆశ నటిస్తూ లేదులే చెప్పు అనడంతో ఇప్పుడు ముహూర్తాలు లేవు అని అనుకుంటుంటే విన్నాను ఆశ మెల్లిగా.

అయితే పెళ్లి అయిన నేను బ్రహ్మచారిగా ఉండాల్సిందేనా అంటూ తల కొట్టుకున్నాడు చరణ్ మొత్తం మీరు ఏ విషయం వినరా అని కాస్త స్వరం పెంచిన ఆశ  గట్టి గానే  సరే చెప్పు అన్నాడు అన్నాడు చరణ్ తల ఎత్తి ఎల్లుండి రాత్రికి పెట్టారు అదేరోజు అత్తయ్య వాళ్ళు కూడా వస్తారు చెప్పింది మెల్లిగా యాహూ అంటూ గట్టిగా అరిచేసరికి ఏమైంది అల్లుడు గారు అంటూ వచ్చారు సతీష్ గారు ఆశ ముసిముసిగా నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది ఏం లేదండి ఏదో గుర్తొచ్చింది అంతే అన్నాడు ముద్ద నోట్లో పెట్టుకుంటూ..

సరే బాబు ఒక విషయం రేపో ఎల్లుండో అన్నయ్య వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చాక ముహూర్తం చూస్తాను అన్నాడు అతను సరేనండీ కానీ ఎల్లుండి మా ఆఫీసు వాళ్ళు పార్టీ ఇమ్మని అడిగారు కాబట్టి నేను పార్టీ ఇస్తున్నాను మీరు మీ అమ్మాయి తో చెప్పండి ఫంక్షన్ హాల్ లో అన్ని ఏర్పాట్లు చేశారు రేపు తొందరగా వస్తాను షాపింగ్ కి వెళ్లి వద్దాం అన్నాడు తింటూనే సరే బాబు దాందేముంది నీ భార్య నీ ఇష్టం మీరు వెళ్లి వచ్చేసరికి మేము వంట చేసి పెడతాం అన్నాడు.

Wedding Couple Free Stock CC0 Photo

లేదండి అందరం వెళ్ళాలి నాకు పరాయి అనే భేదం లేదు మీరు కూడా నా వాళ్ళే అత్తమామలు అంటే పరాయి వాళ్ళని అనుకోను నేను అందరం కలిసి వెళ్దాం బయట డిన్నర్ చేద్దాం మీకు మాత్రం ఎవరున్నారు మేము తప్ప మీరు అలాంటి సందేహాలు ఏమి పెట్టుకోకండి నేను మీకు అల్లుని అయినా  కొడుకు లాగానే అని అనుకోండి ఏదైనా మీరు నాతో ఫ్రీగా ఉండొచ్చు చెప్పొచ్చు అన్నాడు చేతులు తుడుచుకుంటూ..

కొత్త జీవితం

అతని మాటలతో సతీష్ గారు చాలా సంతోషం బాబు నాకు ఉన్న అనుమానాలు అన్నీ ఈ ఒక్క మాటతో తీరిపోయాయి చాలు బాబు చాలు ఇక నేను నిశ్చింతగా ఉండొచ్చు అన్నాడు అత్తయ్య గారు ఆశ ఇలా రండి అని పిలిచాడు అందరూ టేబుల్ దగ్గరికి వచ్చారు చూడండి.

నాకు నా తల్లిదండ్రులు ఎంతో మీరు అంతే నాకు ఏదైనా చెప్పాలనుకుంటే మీరు నిరభ్యంతరంగా చెప్పొచ్చు మాట్లాడవచ్చు అన్నట్లు మా అమ్మానాన్నల కు కూడా ఇదే విషయాన్ని చెప్పాను ఇక వాళ్ళు కూడా ఆశని కన్న కూతురి కంటే ఎక్కువగానే చూసుకుంటారు ఆవిషయంలో మీరేం దిగులు పడొద్దు నేనే మీకు అన్నాడు మామ గారిని దగ్గరికి తీసుకుంటూ అల్లున్ని  శత్రువుల చూడొద్దు అనుకోవద్దు మామ గారు మీరు మీ అబ్బాయి తో అయితే ఎంత ఫ్రీగా ఉంటారో నాతో కూడా అంతే ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పాడు చరణ్.

ఆ మాటలకు సతీష్ గారు కన్నీళ్లు తుడుచుకుంటూ మేము చాలా అదృష్టవంతులం బాబు మా అమ్మాయి కూడా చాలా అదృష్టవంతురాలు మా జన్మ ధన్యం అయినట్లే అనగానే కాదండీ ఇంత మంచి అందమైన అమ్మాయిని నా కోసమే కన్నా మీకు శతకోటి నమస్కారాలు మీకు నేను అల్లుణ్ణి అవడం నా పూర్వజన్మ సుకృతం అన్నాడు చరణ్ హృదయపూర్వకంగా ఆ మాటలను వింటూ చల్లగా నిండు నూరేళ్లు వర్ధిల్లు బాబు అన్నారు ఇద్దరు సరే ఇక పడుకోండి బాగా పొద్దుపోయింది మళ్లీ రేపు ఆఫీసు ఉందిగా అని అన్నారు లేదు అత్తయ్య నేను సోఫాలో పడుకున్నాను మీరు బెడ్ రూమ్ లో పడుకోండి కింద పడుకుంటే మీకు కంఫర్ట్ గా ఉండదు అని వారిని బలవంతంగా బెడ్ రూమ్ లోకి పంపేసి తాను దిండు దుప్పటితో సోఫాలో పడుకున్నాడు.

ఆ ముసలి దంపతులు ఇద్దరు చరణ్ తమ అల్లుడిగా రావడం  అతని మనసు తెలుసుకుని చాలా సంతోషించారు ఇద్దరికీ అప్పటివరకు ఉన్న అనుమానాలన్నీ తీరి పోయి ఒకలాంటి నిశ్చింత కలిగింది ఇక దిగులు మర్చిపోయి హాయిగా గుండెల మీద చేతులు వేసుకుని ఆదమరచి నిద్ర పోయారు హృదయాల తో నిద్ర పోయింది చాలా రోజుల తర్వాత.. తెల్లారింది ఎప్పటిలాగే ఆఫీసుకు బయలుదేరుతూ షాపింగ్ గురించి మరొకసారి గుర్తు చేసి సాయంత్రం ఆరు గంటల వరకు రెడీ గా ఉండమని చెప్పాడు దాంతో అందరూ సరేనన్నారు.

Page 6 | Royalty-free married photos free download | Pxfuel

మధ్యాహ్నం ఆశ  నుండి ఫోన్  రావడం అత్తయ్య వాళ్ళు వచ్చారని చెప్పడంతో ఆఫీసు వారికి చెప్పి వారిని ఆహ్వానించి అతను ఇంటికి వెళ్లిపోయాడు కాసేపు తర్వాత పార్టీ గురించి చెప్పగానే తల్లిదండ్రులు కూడా సంతోషించారు. వాళ్ళు కూడా ఆశ అనే సొంత కూతురిలా చూసుకోవడం చూసి ఆశ తల్లిదండ్రులు సంతోషించారు  సాయంత్రం అంతా కలిసి షాపింగ్ కి వెళ్లి అట్నుంచి అటే డిన్నర్ చేసి తొమ్మిది గంటలకు ఇంటికి చేరుకున్నారు.అవసర శరీరాలతో అందరూ నిద్రకు ఉపక్రమించారు.

మగవాళ్లు హాల్ లో పక్కలు వేస్తే ఆడవాళ్ళు బెడ్ రూమ్ లో సర్దుకున్నారు ఆ రాత్రి తెల్లారితే పార్టీతోపాటు శోభనం కూడా కాబట్టి విశ్రాంతి తీసుకోమని పిల్లలిద్దరికీ చెప్పారు అందరూ నిద్ర లోకి జారుకున్నారు తెల్లారి ఫంక్షన్ హాల్ కి ఇంటికి మధ్య దూరం తక్కువే కాబట్టి సామానంతా ఇంట్లో నుండి తీసుకుని వెళుతూ డెకరేషన్ చేస్తూ హడావిడిగా తిరుగుతున్నాడు చరణ్

సుదర్శన్ మామ సతీష ఇద్దరు సహాయం చేస్తానన్న ఏం లేదు పని అన్నీ అయిపోయాయి ఇక ఫుడ్ వస్తే చాలు మీరు కేవలం అలా కూర్చొని చూస్తూ ఉండండి అన్నాడు వారితో వద్ద మేమెందుకు బాబు అన్నారు ఇద్దరు. దానికి చరణ్ తల్లిదండ్రులు మీకు ఉండే విలువ మీకు ఉంటుంది కాబట్టి మీరు రావాల్సిందే అన్నాడు ఏం మాట్లాడలేకపోయారు పెద్దలు.

మధ్యాహ్నం కూడా ఇంట్లో లో వంట చేయించకుండా బయట నుండే తెప్పించాడు చరణ్ అందరూ తిని రెస్ట్ తీసుకున్నారు దగ్గరుండి ఆశకు పార్టీలో ఏ చీర కట్టుకోవాలి చూపించాడు ఆశ కు కూడా నచ్చడంతో సరే నంది సాయంత్రం అయింది చూస్తుండగానే ఒక్కొక్కరు వస్తున్నారు పార్టీకి ఫంక్షన్ హాల్ లో మిత్రుడు వాసు రిసీవ్ చేసుకుంటున్నారు చిరునవ్వుతో అందరితోనూ జోక్స్ వేసుకుంటూ ఉన్న అతను అక్కడున్న అందరికీ నచ్చాడు.

Page 7 | Royalty-free wife photos free download | Pxfuel

పల్లవి కూడా తన భర్తతో కలిసి వచ్చింది ఎన్నడు ఇలాంటి ఫంక్షన్ కి రాని పల్లవి భర్త పిలవగానే రావడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు పార్టీ మొదలైంది ఇద్దరు స్టేజి మీదకు రావడం తో అంతటా నిశ్శబ్దం ఆవరించింది చరణ్ మైక్  తీసుకొని డియర్ ఫ్రెండ్స్ నా ఈ పార్టీకి పిలవగానే వచ్చిన మీకు ధన్యవాదములు ఇకపోతే మీరు నా పెళ్ళికి రాలేకపోయినా అందుకు మీకు నా భార్య ని పరిచయం చేయాలని ఈ పార్టీని పిలిచాను ఇప్పుడు మీ అందరికీ నా భార్యని పరిచయం చేస్తాను అంటూ మీ టు మై వైఫ్ మిసెస్ ఆశ చరణ్ అని భార్య నీ కాస్త ముందుకు పిలిచాడు.

ఆశ ముందుకొచ్చి అందరికీ నమస్కరించింది ఆశని చూస్తున్నా పల్లవి ఆశ్చర్యపోయింది మళ్లీ మళ్లీ చూసింది తనేనా కాదా అన్నట్టుగా అవును తనే ఆశ అనే అయ్యో ఆశని చేసుకున్నది చరణ్ నా అయ్యో రామ పాపం చాలా మంచివాడు ఇలాంటి అమ్మాయిని ఎలా చేసుకున్నాడు ఇదైనా ఎలా ఒప్పుకుంది పెళ్లికి ఎలా చేసుకుందో చరణ్ ని ఎలా మోసం చేయాలని అనిపించిందో, అని అనుకుంటూ భర్త పిలుస్తున్నా వినకుండా స్టేజి పైకి వెళ్ళింది తను వెనకే  వెళ్ళాడు ఆమె భర్త ఇద్దరూ వెళ్లి వచ్చిన గిఫ్ట్ అందిస్తూ చరణ్ తో  నేను ఆశ తో మాట్లాడాలి అంది.

హే నువ్వు  ఏంటే ఇక్నుకడ వ్వే నువ్వు ఇక్కడ అంది ఆశ్చర్యంగా ఆశ .  మా ఆఫీస్ లో పనిచేస్తుంది నీకు ముందే తెలుసా అన్నాడు చరణ్ ఇద్దరం కలిసి చదివాం  అంటూ ఇబ్బంది గా నవ్వింది పల్లవి ఏమనాలో తెలియక ఆశ ని  చూస్తుంటే తనకి తేళ్ళు జెర్రులు పాగినట్టుగా అనిపించసాగింది.

ఆమె నవ్వుతుంటే కంపరంగా ఉంది ఒక మంచి వాడిని మోసం చేస్తుందని ఊహ ఆమెకు విసుగు తెప్పించసాగింది ఏంటి ఇది అని కడిగేయాలి ఉంది కానీ సమయం చిక్కడం లేదు ఎప్పుడో ఎవరో ఒకరు రావడం గిఫ్టు ఇవ్వడం పక్కనే ఉండడంతో ఏం మాట్లాడలేక పోతుంది భార్య కి ఆమె మిత్రులని తెలిసి అందుకే పరిగెత్తింది అని అనుకున్నా పల్లవి భర్త మిగిలిన వారితో కలసి పోయాడు ఆమెని ఆశ దగ్గర వదిలేసి చాలా సమయం గడిచాక అందరూ డిన్నర్ కి వెళ్లారు చరణ్ కూడా వారికి కావాల్సిన ఏర్పాట్లు చూస్తూ ఉండిపోయాడు దగ్గరుండి .

Adorable Gifts for Newly Married Couples in India and How to Pick Presents They Will Want

అప్పుడు టైం కుదిరి దగ్గరికి వెళ్లిన పల్లవి ఆమె చెయ్యి పట్టుకుని ఫంక్షన్ హాల్ లోనే ఓ మూలగా ఉన్న గదిలోకి లాక్కొని వెళ్ళింది ఏంటే ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ అడిగింది ఆశ విసుగ్గా చూస్తూ దానికి ఆ మాట నేను అడగాలి ఏంటే ఇది ఎందుకిలా చేస్తున్నావు అంత మంచి వాడిని మోసం చేయాలని నీకు ఎలా అనిపించింది ఇలాంటి దాన్ని నేను ఎక్కడా చూడలేదు అని చిత్కరించింది పల్లవి ఏంటి ఏ విషయం గురించి నువ్వు మాట్లాడుతుంది.

ఎవరిని నేను మోసం చేస్తున్నాను అసలే మాట్లాడుతున్నావు నువ్వు అని ఏమీ తెలియనట్టు గా ఆశ నువ్వేం చేయనట్లు అని పల్లవి అవును నేనేం చేశానో చెప్పు ఎవరిని మోసం చేస్తున్నానో వివరంగా చెప్పు ఆ తర్వాత నన్ను నిందించు కానీ ఇలా ఏం చెప్పకుండా ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు అని కాస్త కఠినంగా ఆశ నువ్వేం చేసావో చెప్పాలా అయితే చెప్తా విను చరణ్ ని మాయ చేసి పెళ్లి చేసుకోలేదా అది మోసం కాదా అనేది పల్లవి ఆవేశంగా .. ఓ ఆ సంగతా నువ్వు మాట్లాడేది అంది ఆశ నింపాదిగా ..

అవును ఆ సంగతే శీలం పోయిన దానివి ఎలా ఇలా పెళ్లి చేసుకున్నావు ఎందుకు చేసుకున్నావు అంది పల్లవి. ఏ ఎందుకు చేసుకోకూడదు అలా అని ఎక్కడైనా రూల్ ఉందా అంది ఆశ అలా కాదు గాని ఆ సంగతి అతనికి తెలుసా అని తిరిగి తెలుసా నా తెలిసిన నువ్వే  ఇన్ని మాటలు అంటున్నావు మాట్లాడుతున్నావు ఎలా చేసుకున్నావ్ అని అడుగుతున్నావు తెలిస్తే అతను చేసుకుంటాడా అంది ప్రశ్నిస్తూ లేదు చేసుకోడు మరి ఇలా దాచిపెట్టి చేసుకోవడం మంచిదా అతన్ని మోసం చేయడం కాదా అంది పల్లవి.

మోసమా మోసమా ఏముంది నా శీలం పోయిన విషయం లో నా తప్పేమైనా ఉందా అసలు నేను కావాలని పోగొట్టుకున్నానా నీలాగా అంది పల్లవిని చూస్తూ ఆ మాటకు బెదిరిపోయి నేనేం కావాలని పోగొట్టుకోలేదు ప్రేమించాను అర్పించాను వాడు మోసం చేస్తారు అనుకోలేదు అంది పల్లవి గొంతు తగ్గించి కదా మరి  ప్రేమించిన అని నువ్వు వాడికి శరీరాన్ని చూపించావు కానీ తెలిసిన వాడు మోసం చేసే సరికి వాడిని మర్చిపోయి ఇంకో పెళ్లి చేసుకున్నావ్ కానీ నేను ఏ తప్పు తెలిసి చేయలేదు ఆ రోజు కాలేజీ ఫంక్షన్ లో వాళ్ళు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి నా శీలాన్ని దోచుకున్నారు తెలివి వచ్చాక నేను చాలా ఏడ్చాను చని పోదాము అని కూడా అనుకున్నాను .

File:Indian wedding Delhi.jpg - Wikimedia Commons

కానీ నాకు తెలియకుండా జరిగిన యాక్సిడెంట్ గురించి చనిపోయి నా తల్లిదండ్రులకు కడుపుకోత ని మిగల్చ లేక కొన్ని రోజులు మధన పడ్డ ఏం చేయాలి అని ఆలోచించాను కానీ నాకు అనిపించింది ఒక్కటే అది ఒక యాక్సిడెంట్ అంతే ఆ ఆలోచన రాగానే నా మనసు తేలిక అయింది నేను నా ఒళ్ళు కొవ్వెక్కి శరీరం  మలినం చేసుకోలేదు కావాలని ఇది చేయలేదు ఎవర్ని మోసం చేయాలని లేదు చూడు కాలికి దెబ్బ తగిలింది అనుకో మంట పెడుతుంది రక్తం వస్తుంది దాన్ని చూసి కొన్ని రోజులు బాధపడతాం కొన్ని రోజులు ఏడుస్తాం ఆ తర్వాత అది మానిపోతుంది ఇది కూడా అంతే అసలు ఏం జరిగిందో ఎవరు ఏం చేశారో కూడా నాకు గుర్తు లేదు అందుకే ఆ విషయాన్ని అంతటితో మర్చిపోయాను.

చరణ్ సంబంధం రాగానే ఒప్పుకున్నాను అవును నాకు తెలియక అడుగుతాను అసలు శీలం అంటే ఏంటి అది పోతే ఇక జీవితం అయిపోయినట్టేనా ఇక చచ్చిపోవాల్సిందే నా శీలం పోయిన వారికి జీవితమే లేదా చెప్పు నువ్వు లేదు అన్నావ్ అనుకో మరి అలాంటప్పుడు ఒక హీరో ని చూస్తాం ఇష్టపడతాం అతనితో కలలు కంట అలా అయితే శీలం పోయినట్టేనా అంటే అవి కేవలం కలలు ఊహలు అంటావేమో నిజంగా పవిత్రంగా ఉండాలని కోరుకునే వారు కలల్లో ఊహల్లో కూడా వేరే వ్యక్తులను ఊహించుకో ఎందుకంటే అది ఇది మానసిక వ్యభిచారం అది శీలం పోయిన దానికంటే ఎక్కువ కాబట్టి.

ఇక చరణ్ విషయం అంటావా నేను అతనికి ఏదీ చెప్పలేదు చెప్పను కూడా ఎందుకంటే అతని జాలి నాకు అవసరం లేదు నాకు శీలం పోయిందని ఇప్పుడు నువ్వు గుర్తు చేసే వరకు కు నాకు గుర్తులేదు మర్చిపోయాను అది ఒక యాక్సిడెంట్ మాత్రమే అని గుర్తు పెట్టుకున్నాను కాబట్టే  ఇప్పుడు సంతోషంగా ఉండాలి అనుకుంటున్నా నువ్వు మగవారికి ఉండదా శీలం వాళ్లు కూడా ప్రేమించినప్పుడు ఒకరి కళ్ళలో ఒకరు ఊహల్లో ఒకరిని ఊహించుకుంటూ శీలం పోగొట్టుకుంటారు అది తప్పు కాదా నిజానికి శీలం అంటే గుణం సంస్కారం ఆత్మాభిమానం అణకువ జాలి దయ కరుణ ఇలాంటి మంచి సుగుణాలన్నీటిని శీలం మంటారు.

అవి నాకు చాలా పుష్కలంగా ఉన్నాయి నేను ఇప్పటికీ శీలం ఉన్న దాన్నే మరి నువ్వే ఆలోచించుకో అంది ఆశ పల్లవి ని చూస్తూ ఒళ్ళు కొవ్వెక్కి తాను తన ప్రియుడితో చేసిన దాన్ని గుర్తు చేసుకుంటూ తలదించుకుంది పల్లవి తప్పు-ఒప్పు ఉన్నట్లుగా ఆశ చెప్తున్న ప్రతి మాట నిజమే అని మనసు చెప్తుంది అది కావాలని ఏది చేయలేదు అసలు దాని తప్పు లేదని తెలిసి చరణ్ మీద అభిమానంతో ఇలా మాట్లాడింది కానీ ఆశ చెప్పిన ప్రతి మాట దగ్గరగా వచ్చి నువ్వేం తప్పు చేయలేదు కావాలనుకున్న దొరకలేదు వదిలేయ్ ఇక నీ అనుమానాలన్నీ తీరినట్టేనా అంది గడ్డం పైకెత్తుతూ కళ్ళనిండా నీళ్ళతో తలూపింది పల్లవి ఇద్దరు గట్టిగా ఆప్యాయంగా కౌగిలించుకున్నారు .

Royalty-free wedding dance photos free download | Pxfuel

గది బయట నిలబడి వారి మాటలు అన్నీ వింటున్న చరణ్ కి  కూడా గుండె బరువెక్కింది నిజమే కాలేజీలోనూ సినిమాలోని హీరోయిన్ ని ఊహించుకున్న రోజులని తన ప్రియురాలితో పంచుకున్న మధురిమలను తలచుకుని తాను కూడా  శీలం కోల్పోయిన వాడిని అని అనుకొని నిట్టూర్చాడు తాను ఆశ నీ  తీసుకెళ్తామని వస్తే తన భార్య ఆలోచన విధానం చూసి అబ్బురపడి ఈ ఆలోచన లేక భయపడి బాధపడి బావిలో దూకి చనిపోయిన తన చెల్లెలు గుర్తొచ్చి అంత ధైర్యం ఇవ్వలేని తన చేతకానితనాన్ని అప్పుడే పరిచయం అవనందుకు ఆశని కాలాన్ని తిట్టుకున్నాడు .

ఆపైన తన భార్య మానసికంగా దృఢంగా ఉందని ఆమె చెప్పినట్టుగా శీలం అనేది శరీరానికి కాదని మనసు కు అని గ్రహించిన వాడై  మనసులో భయాలన్నీ  అనుమానాలన్ని పటాపంచలు అవగా తలుపు కొట్టాడు ఇద్దరు తేలికైన మనసు తో బయటకు వచ్చారు నవ్వుతూ ముగ్గురు ముందుకు సాగారు కొత్త జీవితం వైపుగా .

-ప్రియా

Related Posts