కొత్తిల్లు

కొత్తిల్లు

కొత్తిల్లు

అవి మేము కొత్తగా కొత్త ఇంటికి వెళ్లిన రోజులు..అదంతా అడవి లాంటి ప్రదేశం లాంటి ఏంటి? అడవే!ఆ అడవిలో సింగరేణి కార్మికుల కోసం క్వాటర్లు కట్టారు

అందులోకి వెళ్లాం మేము ఇద్దరు పిల్లలతో!మెుత్తం మాతో పాటు పాములు తేల్లు కూడా ఉండేవిఅవే అలా ఉన్నాయంటే ఆటోలు రిక్షాలు లాంటివేవీరావు ఊరి లోపలికి..ఎక్కడో మెయిన్ రోడ్డు దగ్గర దిగి నడుచుకుంటూ రావాలి..

మేమున్న ఊరికి పదిహేను కిలో మీటర్ల దూరంలో సిటీమంచిర్యాల ఉండేది..అక్కడ మా బంధువులు చాలా మందే ఉండేవాళ్లు..ఒకసారి మా ఆడపడుచు మా ఇంటికి వచ్చి మంచిర్యాలలో ఉండే వాళ్ల మరిదికి గుండె ఆపరేషన్ అయింది చూసి వద్దాం రమ్మంది..

మా వారు ఇంట్లోనె ఉండే సరె చూసి రాపోండి నేను పిల్లలను చూసుకుంటా అన్నారు..నేను అప్పటికి వెళ్లాలా? వద్దా? అనుకున్నా! పిల్లలతోతనకు కష్టం అని..మా వారేమెా అక్కకు తోడుగా వెళ్లు ఏం కాదు నేనుచూసుకుంటా కదాని గట్టిగా అన్నారు..ఆవిడేమెా నేను మళ్లీ ఇక్కడికి రాను అదే బస్సులో వెళ్లిపోతా! నువ్వు దిగి నడుచుకుంటూ రావాలి అంది

ఏం కాదులే వస్తది సిటీలో పెరిగింది ఆ మాత్రం రాలేదాఅని నా మాటగా ఆయనే చెప్పారు..ఇక భోజనాలు టీలు అయ్యాక సాయంత్రం ఆరింటికిబయలు దేరాం! వాళ్లింటికి వెళ్లే సరికే ఏడైంది..ఓ గంట ఉండి మళ్లీ బయలుదేరాం!చీకటైపోయింది బస్సులో సీట్లు లేక ఆవిడ ముందు కూచుంది నేను వెనుకకు కూచున్న..

మేముండే స్టేజ్ రాకముందే కేకేసి పిలిచింది పైగా తొందరగా దిగుదిగు అని హడావుడి పెట్టింది..చీకట్లే ఏం తెలియక దిగేసా!చుట్టూ నిర్మానుష్యం ఆ దారిలో భయపడుతూ లోపలికి వెళ్తూనె ఉన్నా!ఎంత వెళ్లినా మా ఇల్లు రావడం లేదు అసలెటు వెళ్తున్నానో అర్థం కావడం లేదు..

ఎక్కడో కుక్కల అరుపులు అంతా అడవే! చాలా భయమేసింది..అప్పటికే చాలా దూరం నడిచా! అది కాదనిపిస్తుందిఎలా? ఎలా? దిక్కుతోచడం లేదు..నా దగ్గర డబ్బులు కూడా లేవు ఉన్న డబ్బులు మాఆడపడుచుకే ఇచ్చా! ఆవిడ టికెట్ తీసుకుని నాకు మళ్లీ పర్స్ ఇవ్వనే లేదు..

ఏడుపొస్తుంది..మళ్లీ వెను తిరిగా!నడుస్తున్నా!ఇంతలో నా పక్కగా బండి ఆగింది ..ఇక అయిపోయా! అనుకున్నా!ఎందుకంటె మేం వెళ్లిన కొద్ది రోజుల్లోనె అక్కడొక మహిళను చంపేసారని వార్తల్లో చెప్పారు ఇక వణికిపోయా! అది గుర్తొచ్చి..

కానీ వచ్చింది కృష్ణారెడ్డి..( కానీ ఆయనెవరో అప్పుడు నాకు తెలియదు..)ఎవరు మేడం ఈ చీకట్లో అని అడిగాడు..ఇక నా దగ్గర డబ్బులు కూడా లేవు గత్యంతరం లేకనేను…నేను దారి తెలియక అన్నా భయంగానే!

ఎక్కడి కెళ్లాలి? అన్నాడు..శ్రీరాంపూర్…అని మా వారి పేరు చెప్పాను..అయ్యెా! అమ్మా! మీరా? మా సారే! నేను సార్ దగ్గరే పని చేస్తాను రండి దింపుతా! అన్నాడు..అప్పటి వరకు ఎవ్వరి బండి కూడా ఎక్కలేదు మెుదటి సారి ఎక్కక తప్పలేదు..

నా పాలిట దేవుడిలా వచ్చాడు..ఆయన నైట్ షిఫ్ట్ కి వెళ్తున్నాడట..ఇక ఇంట్లో క్షేమంగా దించి మా సార్ తో మాట్లాడి వెళ్లాడు…మా పిల్లలైతే ఇప్పటికీ ఏడిపిస్తారు ఆ సంఘటనను గుర్తుచేసి..మా సార్ చెప్పీ చెప్పీ వాళ్లకలా తెలిసి పోయింది..

( తనున్నప్పుడు ఇక ఒంటరిగా ఎటూ పంపలేదు..)అమ్మ శ్రీరాంపూర్ అనుకుని సిసిసి లో దిగిందని వెటకారం చేస్తారు..ఇప్పుడు పిల్లలు కూడా పంపరు ఒంటరిగా!ఇప్పుడు ఆ అడవంతా మంచి సిటీలుగా మారాయి..అదండి నా నిర్మానుష్యపు దారి సంగతి…

 

-ఉమాదేవి ఎర్రం

 

ఆఖరి శ్వాస Previous post  ఆఖరి శ్వాస
ఒంటరి Next post ఒంటరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close