కృష్ణ లీలలు
జగమేలే జగదీశా జగతికి గురుడవు నీవేగా!
అష్టమి నాడు ఉదయించిన అష్టమ పుత్ర కష్టములన్నీ నీవేగా .
ఎంత కష్టమున్నను నవనీత చోరా మోమున నవ్వులు చిందించితివయ్యా.
పూతన పాలు తాగి పురుషోత్తమా నగరికి ముసలమ్మును మాపితివయ్యా.
మన్ను తిన్న యశోద నందనా అమ్మకు నోటిలో బ్రహ్మాండంబులు చూపితివయ్యా.
అల్లరి వలదు కృష్ణయ్యా అని అమ్మా రోటికి కట్టగా బంతిలాగ లాగినావయా .
చిటికెన వేలుతో గోవర్ధన గిరి ఎత్తిన గోపకిశోర! గొల్లవారిని కాచితివయ్యా..
నీ చిలిపి చేష్టలతో గోపికల మనసు దోచిన గోపాలకృష్ణ నీకెన్ని మాయలయ్యా.
రాధమ్మతో రాసలీలలాడిన బృందావన విహారి , ధర్మము నిలపగ నీవేనయ్యా.
జంట చెట్లు కూల్చి నలకూబర మణిగ్రీవుల శాపము బాపి అమాయకముగ మోము పెట్టిన కృష్ణయ్యా .
రణమున నిలచి కంసుని చంపిన వీర కిషోర ! అష్టభార్యలను చేపట్టితివయ్యా.
భక్తి అంటే తెలియగా తులసి దళమున తూగితివి రుక్మిణిని అందుకు సాక్ష్యముగా చూపించితివి.
నీ లీలలు ఎన్ని చెప్పినా తక్కువే మాతోడుగ నిలువవయ్యా యశోద కృష్ణయ్యా.
జగతికి గురువైన జగదీశ్వర అష్టమి నాడుదయించిన నందనందనా ఇల చూడగరావయ్యా ..
– ఆలపాటి సత్యవతి