క్షణ భంగురం ఈ జీవితం

క్షణ భంగురం ఈ జీవితం

మదిలోమెదిలే క్షణముకొక కోర్కె
సాదింపవలయునన్న ఆర్బాటమున
కోల్పోయేనే ఆనందాల హరివిల్లును
ఎరుగవా జీవితం క్షణ భంగురమని

అంతులేని ఐశ్వర్యమునకై
అనంత విద్యలు నేర్చి
ఆశల సౌధాన్ని పర్చదవే
క్షణ భంగురమైన జీవితానికి

జననమరణ కార్యములు
పుణ్యఫలములు నీలిఖితమై
క్షణభంగుర జీవితమున
కీలుబొమ్మను జేస్తివా ప్రభూ!

– హనుమంత

Related Posts