కులం

కులం

 

10th అయిపోయాక ఇంటర్ లో ఎం గ్రూప్ తీసుకోవాలో తెలియక అర్ధం కానీ పరిస్థితిలో నేను ఉన్నాను. కానీ మా బంధువులు అందరు MPC టేసుకో లైఫ్ లో హెల్ప్ ఫుల్ గా ఉంటుంది అది తీసుకో అన్నారు. కానీ ఇంటర్ లో నేను CEC తీసుకున్నాను. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా నా పేరు బాలాజీ.

 

కొని నెలలు తరువాత

ఈ రోజు కాలేజీ రీఓపెన్. కాలేజ్ లో అందరు వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ తో జాయిన్ అయ్యరు. నేను మాత్రం స్కూల్ ఫ్రెండ్స్ తో కాకుండా నార్మల్ గా జాయిన్ అయ్యాను. క్లాస్ లో అబ్బాయిలు ఒక పక్క అమ్మాయిలు ఒక పక్క కూర్చునేవారు. అమ్మాయిల సైడ్  చూస్తే వాళ్ళు కూడా ఫ్రెండ్స్ తో జాయిన్ అయ్యరు.

కానీ ఒక అమ్మాయి మాత్రమే బాధగా ఉంది. నేనూ ఎందుకో ఆలోచించి వదిలేసాను. కాలేజీ ఐపోయింది అందరం ఇంటికి వెళుతున్నాం. నేను మాత్రం ఫ్రెండ్స్ తో కాకుండా ఒంటరిగా వెళుతున్నా. ఆ అమ్మాయి కూడా ఎవరితో మాట్లాడకుండా ఒక్కత్తే వెళ్ళడం చూసాను.

మరుసటి రోజు కాలేజ్ లో కూడా అలానే ఉంది. ఆ రోజు ఆ అమ్మాయితో మాట్లాడాను.

హాయ్ నా పేరు బాలాజీ.

మీ పేరు ఏంటి?

తను: నా పెరు ప్రియా.
బాలాజీ: ఓక క్వశ్చన్ అడగొచ్చా.
ప్రియ: హా చెప్పండి
బాలాజీ: మీరు నిన్న, ఈరోజు బాధగా ఉన్నారు ఎందుకు అండి?
ప్రియా: ఓహ్ అదా అదేంలేదు. అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ తో ఉన్నారు. నేను మాత్రమే ఒకదానిని ఉన్నాను. అందుకే అలా….
బాలాజీ: నేను కూడా అలాగే… ఫ్రెండ్స్ గా ఉందామా.
ప్రియ: హా సరే.

అలా అలా 1వ సంవత్సరం ఐపోయింది 2వ సంవత్సరంలో జూనియర్స్ వచ్చారు. నేనూ, ప్రియా ఎవరినైనా ఫ్రెండ్స్ గా చేసుకుందామా అని చూస్తున్నాం. కానీ ఎవరు బాగా అనిపించలేదు. కానీ నాకు ఒక అమ్మాయి నచ్చింది. నేను సీనియర్ ని కాబట్టి గౌరవం తో నేను మాట్లాడగానే మాట్లాడింది.

ఇక అలా రోజూ మాట్లాడుకునేవాళ్ళం. ఇంటర్ ఐపోయింది డిగ్రీ లో జాయిన్ ఐపోయాము. తన పేరు చెప్పడం మార్చిపోయా కదా.. తన పేరు శ్రీ. డిగ్రీ 2వ సంవత్సరం లో నేను శ్రీ కి ప్రపోజ్ చేసా. తను అప్పుడు డిగ్రీ 1వ సంవత్సరం. కొన్ని రోజులు అయ్యాక చెప్తాను అని చెప్పింది.

నేను కూడా సరే అన్నాను. 10 రోజులు తరువాత నా ప్రేమని ఒప్పుకుంది. ఆ తర్వాత చాలా క్లోస్ అయ్యాము. పెళ్ళయ్యాక ఎం చెయ్యాలి, పిల్లలని ఎలా చూసుకోవాలి, లాంటి ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని చేసుకున్నాము.

5వ సెమిస్టర్ తరువత క్యాంపస్ ఇంటర్వ్యూలో నాకు ఉద్యోగం వచ్చింది. కొంచం కష్టపడి 6వ సెమిస్టర్ పాస్ అయ్యాను. 1 ఇయర్ తరువత శ్రీ వాళ్ళ ఇంట్లో మేము మా పెళ్లి విషయం చెప్పి ఒప్పిద్దాం అని అనుకున్నాం.

కానీ వాళ్ళు మా పెళ్ళికి ఒప్పుకోలేదు. కారణం అడిగితే కులం వేరు అని చెప్పారు. నాకు జాబ్ ఉంది, తనని బాగా చూసుకుంటాను అని ఎంత ఒప్పించడానికి ప్రయత్నించినా కూడా అంగీకరించలేదు.

2 రోజులు తరువాత

శ్రీ: హాయ్ బాలాజీ మన పెళ్లికి ఇంట్లో ఓపుకోలేరు కదా. నాకు వేరే వాళ్ళతో పెళ్లి ఫిక్స్ అయిపొయింది. ఇక నాకు ఎప్పుడూ ఫోన్ చెయ్యకు. నన్ను మర్చిపో, మళ్ళీ నాకు ఫోన్ చెయ్యడానికి కానీ, నన్ను కలవడానికి కానీ ప్రయత్నించకు. నువ్వు హ్యాప్పీ గా ఉండాలి బాలు నేను అదే కోరుకుంటున్నా.. 

బాలాజీ :- ఏంటి శ్రీ? ఎం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చి పట్టిందా? మనం ఎన్ని ప్లాన్స్ వేసుకున్నాం. ఎంత ప్రేమించుకున్నాం. నన్ను వదిలి అసలు ఉండగలవా? కావాలంటే చెప్పు లేచిపోయి పెళ్లి చేసుకుందాం. మీ పేరెంట్స్ గురించి ఆలోచించకు, వాళ్ళని మెల్లగా ఒప్పించొచ్చు నన్ను నమ్ము శ్రీ నిన్ను బాగా చూసుకుంటా…

శ్రీ: లేదు బాలు, నన్ను వదిలేయ్ బాయ్, థాంక్స్. 

బాలాజీ: థాంక్స్ ఆ ఎందుకు

శ్రీ: నేను నీ పై ఎంత కొప్పడ్డా నన్ను ఒక్క మాట కూడా అనకుండా భరించావు. నేను ఇలా చెప్పడం నాకు చాలా బాధగా ఉంది. నీకు ఇంకెంత బాధ అవుతుందో నేను అర్ధం చేసుకోగలను. మంచి అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకో బాలు. బాయ్

బాలాజీ: అది కాదు శ్రీ నేను చెప్పేది….

అని అంటూ ఉంటేనే ఫోన్ కట్ అయ్యింది. 

ఏంటో ఈ 20ల లో కుడా కులం గురించి ఇంత ఆలోచిస్తున్నారు. 

– సాయి

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *