కుండ గర్వభంగం

కుండ గర్వభంగం

ఆరోజు ఆదివారం మాధవరావు, కుటుంబం కోసం మంచి పాట్ బిర్యాని, పన్నీర్ మసాల కూర తెచ్చి భార్యకి ఇచ్చి, ఈరోజు నీకు సెలవు, పిల్లలు మనం’ బిర్యాని, పన్నీర్ కూరతో’ తిందాం! మంచి హోటల్ నుంచి తెచ్చాను ,అన్నాడు ఆనందంగా మాధవరావు..  పిల్లలు, భార్య లక్ష్మి కూడా ఎగిరి గెంతేశారు,

పోనీలెండి !ఇవాళ అయినా నా కిచెన్ కి సెలవు ఇచ్చారు, చక్కగా మంచి సినిమా’ ఓటీటీ లో’ చూస్తూ, కలిసి తిందాం రండర్రా పిల్లలు,!! అంటూ నవ్వుతూ ఆనందంగా కిచెన్ లోకి పరిగెత్తి, మంచి ‘నాన్ స్టిక్ పాన్ ‘ తీసుకొని అందులో హోటల్ నుంచి తెచ్చిన ‘పన్నీరుకూర కు ‘మరి కొన్ని ఉల్లిపాయ ముక్కలు జోడించి, బాగా వేడి చేసి కలిపేసరికి ఇల్లంతా ఆ ఘుమఘుమ వాసనలతో నిండిపోయింది.

సీల్ చేసిన’ కుండ బిర్యాని ని’ ఓపెన్ చేసి అందరికీ కంచాలలో వడ్డిస్తూ, ఖాళీ చేసిన ‘కుండను కూర వేయించిన ‘నాన్ స్టిక్ పాన్ ను ‘అక్కడే ఉన్న షింకు లో పడేసి, ఆహార పదార్థాలన్నీ పిల్లలకు, భర్తకు ఇచ్చి, చక్కగా హాల్లో మంచి తెలుగు సినిమా పెట్టుకుని, ఆ స్పెషల్ భోజనాన్ని ఆస్వాదిస్తున్నారు.
     
కానీ కిచెన్ లో ఒక వింత సంభాషణ జరిగింది ‘నాన్ స్టిక్ పాన్ కు’, బిర్యానీ ఖాళీ చేసిన ‘కుండ కు మధ్య,‘ ఒసే నాన్ స్టిక్ పాన్’, నీకు ఎంత పొగరే, ఏదో కూర వేడి చేశానని పొంగిపోతున్నావేమో, కానీ నీ బ్రతుకు ఎప్పుడూ  నల్లగా మాడిపోయినట్లు, ఉంటుందే, నిన్ను ఎంత తోమినా, ఎన్ని రకాలుగా శుభ్రం చేసిన, నీ రంగు నలుపే ఆ దేవుడు నీకు ఆ శాపం ఇచ్చాడు, అనుభవించు! ఛీ దూరంగా ఉండు, అంటూ ‘బిర్యానీతో ఉన్న ఖాళీకుండ ‘ నవ్వేసరికి, పాపం ‘నాన్ స్టిక్ పాన్ అయ్యో! ఎంత మాట అన్నావు, నేనేం చేస్తాను నా ఖర్మం !అంతే అంటూ కుండ అన్న మాటలకు బాధపడుతూ, కొద్దిసేపు అలాగే ఉండిపోయింది పాన్.

కొంచెం సేపు ఆలోచించి, “ఒసేయ్ కుండా,! నీకు చాలా అహంకారం పెరిగిపోయింది, ఎర్రగా ,బుర్రగా ఉంటానని, నీ కుండల్లో పెట్టిన బిరియానీకి ఎంతో పేరు ఉందని మిడిసి పడకు, నీ జీవితకాలం కొద్ది గంటలేనే, నీ కుండ బిర్యాని తిన్న వెంటనే ప్రజలు నిన్ను బయటికి విసిరేస్తారే ముక్కలైపోతావే, కానీ మాలా కాదు, మేము నల్లగా ఉన్నా కలకాలం ఆ కుటుంబాలతోనే ఉంటామే, అది గుర్తుంచుకో”! అంటూ కోపంగా ఒక్కసారి అట్నుంచి తిరిగేసరికి ‘నాన్ స్టిక్ పాన్ హ్యాండిల్ తగిలి కుండ బద్దలైపోయింది.’

అయ్యో నువ్వు చెప్పింది నిజమే !మా జీవితం కొన్ని గంటలు మాత్రమే, కానీ మాలోని అహంకారం అంతా ఇంతా కాదు, మంచి గుణపాఠం నేర్పావే పాను’, నాలోని అహంకారం చచ్చిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అంటూ ఏడుస్తూ ముక్కలైపోయింది కుండ.

(  హలో ఇది’ హాస్యానికి ‘మాత్రమే రాసినది, కానీ దానిలో ఒక నీతి ఉంది, ఎదుటివారిని చులకనగా చూడడం, అహంకారంతో మిడిసి పడుతుండడం, ఇవి రెండు ప్రజలకు తెలియాలి.)

– వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *