కుటుంబం విలువ

కుటుంబం విలువ

      
“అత్తయ్య… మీరు టీ తీసుకోండి. మావయ్య ఎక్కడ కనిపించడం లేదు?” అని అడిగింది జీవన.
“ఆయన తన మనవడిని తీసుకుని వాకింగ్ కి వెళ్లారు కదా అమ్మ  ,ఇంకా రాలేదు” అని చెప్పింది శారదా దేవి.
“బుజ్జి… స్కూల్ కి త్వరగా రెడీ అవ్వు. నాన్నకి లేట్ అవుతుంది” అని చెప్పింది జీవన.
“అలాగే అమ్మ…” అని చెప్పి వెళ్లి రెడీ అయింది బుజ్జి.
“జీవన టిఫిన్ పెట్టు” అని పిలిచాడు బాలు.
“మీరు కూడా రండి అత్తయ్య. మీకు కూడా టిఫిన్ పెడతాను” అని పిలిచింది జీవన.
“మీ మామయ్య ఇంకా రాలేదు కదా. వచ్చిన తర్వాత మేమిద్దరం కలిసి తింటాం. నువ్వు బాలు , బుజ్జి లకు పెట్టు” అని చెప్పింది శారదా దేవి.
“అలాగే అత్తయ్య…” అని చెప్పి వాళ్ళ ఇద్దరికీ టిఫిన్ పెట్టింది జీవన.

శారదా దేవి వాళ్ళది ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం.  కాలం గడిచే కొద్ది అత్తమామలు చనిపోయారు.  శారదాకి మరిది అయినా వెంకట్రావు ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడు. తనకి ఇంకా పెళ్లి కాలేదు. శారదకి ఒక కొడుకు మాత్రమే , కూతుర్లు లేరు. పెళ్లయిన తర్వాత జీవనన్ని తన కన్న కూతుర్ల చూసుకుంది శారదా దేవి. జీవనకి ఎవరూ లేరు చిన్నప్పుడే ఒక యాక్సిడెంట్లో చనిపోయారు.

శారదా దేవి పక్కింట్లోనే సతీష్ , అనిత లకు ఇద్దరికి కొత్తగా పెళ్లయిన వాళ్ళు ఒక సంవత్సరం క్రితం వచ్చారు. వాళ్లది ప్రేమ వివాహం. జీవితంలో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నారు కానీ, వాళ్ళ పెద్దోళ్ళు ఒప్పుకోకపోయేసరికి ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.

ఇద్దరు పిల్లలు జీవితం బాగుండాలి అని ఉద్యోగం చేస్తున్నారు. మళ్లీ చూసుకోవడానికి ఎవరు పెద్ద వాళ్ళు లేరు. ప్రతిరోజు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన పిల్లలను చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ ని చూశారు. బుజ్జి నీ ప్రతిరోజు బాలు స్కూల్లో డ్రాప్ చేసేవాడు. సాయంత్రం బాలు వాళ్ళ తండ్రి బుజ్జి స్కూల్ నుంచి తీసుకొచ్చేవాడు. సరదాగా గడిచిపోతున్న వీళ్ళ జీవితంలోకి ఒక సంఘటన జరిగింది.

బ్రేకులు లేని కారు గుర్తు యాక్సిడెంట్లు చనిపోయాడు బాలు. పిల్లల్ని అత్త మామ దగ్గర వదిలేసి తను జాబ్ చేయడం మొదలుపెట్టింది జీవన. సతీష్ , అనితలు ఉద్యోగం చేయడం వల్ల పిల్లలతో ఒక్కరోజు కూడా గడిపేవారు కాదు. వాళ్ళు ఒంటరిగా ఫీల్ అయినవారు ఫోన్ కి అలవాటు పడిపోయారు. జీతం ఎక్కువ ఇస్తున్నారు అని ఆశతో కేర్ టేకర్ గా ఒప్పుకుంది ఆవిడ. పిల్లల్ని సరిగ్గా చూడదు చిత్రహింసలు పెట్టుతూ , సరిగ్గా వాళ్ళకి తిండి కూడా పెట్టేది కాదు.

పేరుకి చిన్న కుటుంబం అయినా నలుగురు కలిసి భోజనం కూడా చేసేవారు కాదు. ఆరోజు ఆదివారం పక్కింటి నుండి పిల్లలు ఏడ్చిన సౌండ్ వినిపించేసరికి జీవన వెళ్లి చూసింది. కేర్ టేకర్ పిల్లల్ని కొట్టడం చూసి వీడియో తీసింది జీవన. అనిత కి ఈ వీడియో పంపించి ,

“మీరు ఉద్యోగం చేస్తూ పిల్లలు పట్టించుకోకపోతే ఇలాగే జరుగుతుంది. వెంటనే ఇంట్లో ఒక సీసీ కెమెరా పెట్టండి ఆవిడ నిజస్వరూపం ఏంటో సాక్షాదారాలతో పోలీసులకు పట్టించవచ్చు” అని చెప్పింది జీవన. అయితే జీవన చెప్పినట్టుగా కేర్ టేకర్ కి తెలియకుండా ఒక సీసీ కెమెరా పెట్టించారు. మరుసటి రోజు సాయంత్రం పోలీసులతో జీవన అనిత వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సాక్షాదారాలన్నీ చూపించి పోలీసులకి పట్టించింది కేర్ టేకర్ ని.

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి అంటే మనం తల్లిదండ్రులాగా చూడకపోయినా , ఇంట్లో పెద్దవాళ్లు చూసుకునే వాళ్ళు. ఇప్పుడు చిన్న కుటుంబాలు అయిపోయాయి పిల్లల్ని చూసుకోవాలి ఉద్యోగాలు చేయాలి ఒకటి కాదు ఎన్నో ఉన్నాయి. దాంట్లో మన పిల్లలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేది జీవన. ప్రతి ఆదివారం సతీష్ , అనితలు పిల్లలతో గడిపేవారు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే జీవన వాళ్ళింట్లోనే ఉండమని చెప్పేది అనిత.

శారదా దేవి వాళ్ళ ఆయన ఇద్దరు బుజ్జినే కాదు అనిత పిల్లల్ని కూడా వాళ్ళ మనవరాలుగా భావించి చక్కగా చూసుకునేవాళ్ళు. చిన్న కుటుంబం ,పెద్ద కుటుంబం అయినా మనకి మంచి చెడు చెప్పడానికి పెద్ద వాళ్ళు ఉంటే మనకి మన పిల్లలకి ఎంతో మంచిది. ఉమ్మడి కుటుంబం వల్ల అనురాగ , ఆప్యాయతలు తెలుస్తాయి. ఆ కుటుంబంలో కలిసికట్టుగా ఒకరి మాటలే మీద ఉంటారు కాబట్టి. చిన్న కుటుంబంలో తండ్రిదే బాధ్యత కాబట్టి ,తండ్రి మాట జవతాటరు. అప్పుడే మనకి కుటుంబ విలువ తెలుస్తుంది.

– మాధవి కాళ్ల

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *