కుటుంబం

కుటుంబం

ఒక తోటలో పార్క్ లో ఇద్దరు ముసలి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.

ఒకరు, రాముడు- “నాకు ఒక మనవరాలు, పెళ్ళికి సిద్ధంగా ఉంది. ఇంజనీరింగు చదివింది. ఉద్యోగం చేస్తున్నది. ఎత్తు 5.2. అందంగానే ఉంటుంది. ఎవరైనా తగిన పిల్లవాడు ఉంటే చెప్పండి.”

మరొకరు, రంగడు- “మీ మనవరాలికి ఎటువంటి సంబంధం కావాలి?”

రాముడు- “పెద్దగా ఏమీ వద్దు. అబ్బాయి M.E., లేదా M.Tech; చేసి ఉండాలి. సొంత కారు, సొంత ఇల్లుండాలి. మంచి ఎత్తు ఉండాలి. ఇల్లంటే కాస్త తోట, చెట్లు చేమలుండాలి. మంచి ఉద్యోగం, మంచి జీతం అంటే కాస్త ఓ లక్షో, రెండు లక్షలో ఉండాలి..!”

రంగడు- “ఇంకేమైనా కావాలా?”

అప్పుడు రాముడు- “అన్నింటి కన్నా ముఖ్యంగా, ఆ పిల్లవాడు ఒంటరి వాడై ఉండాలి. అతనికి తల్లిదండ్రులు, తోబుట్టువులు ఎవ్వరూ ఉండకూడదు. ఎందుకంటే, వారుంటే పెళ్ళి తరువాత పోట్లాటలు కావచ్చు కదా..”

రెండవ వృద్ధుని(రంగడు)రెండు కన్నులు నిండి వచ్చాయి. ఆయన కన్నీరు తుడుచుకుంటూ అన్నాడు- “నా స్నేహితుని మనవడున్నాడు. అతగాడికి తోబుట్టువులెవరూ లేరు.

అతని అమ్మా నాన్నా ప్రమాదంలో కన్ను మూశారు. మంచి ఉద్యోగం ఉంది. లక్షన్నర జీతం. పెద్ద కారుంది, పెద్ద భవంతి ఉంది. నౌకర్లూ చాకర్లూ అందరు ఉన్నారు..”

రాముడు సంతోషంతో- “అయితే మరింకేంటి? ఆ సంబంధం ఖాయం చేయించు..”

రంగడు- “కానీ ఆ అబ్బాయికి కూడా కొన్ని షరతులున్నాయి- అమ్మాయికి అమ్మానాన్నలు, తోబుట్టువులు, బంధువులు నా అన్నవారుండ రాదు.”

(ఆ మాట అంటూనే, ఆయనకు గొంతు పూడుకు పోయింది. మళ్ళీ సర్దుకుని అన్నాడు-)

“మీ కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటే, ఆ సంబంధం కుదిరినట్టే. మీ మనవరాలి పెళ్ళి, ఆ పిల్లాడితో హాయిగా, బ్రహ్మాండంగా పెళ్లి అవుతుంది. ఇహ మీ మనవరాలు సుఖంగా ఉంటుంది.”

రాముడు కోపంతో- “ఏంటీ, నీ తిక్క వాగుడు? మా కుటుంబమంతా ఆత్మహత్య చేసుకోవాలా? రేపుదయం ఆ పిల్ల సంతోషంలో, బాధలో ఎవరుంటారు దానికి తోడు-నీడగా?”

రంగడు- “అబ్బో, భలే వారండీ! తన కుటుంబమేమో కుటుంబమా, కానీ ఇతరులది కాదా..?

చూడు నేస్తమా, నీ పిల్లలకు ముందుగా కుటుంబపు విలువలు, మానవత్వం, అందరితో కలిసిమెలిసి ఎలా బ్రతుకలో, ఉండాలో తెలియ చేయి.

చిన్నా పెద్దా ఇంటిల్లిపాదీ మనకు ప్రతి ఒకరు ముఖ్యమైన వారే. కాదంటే, మనిషి సుఖదుఖాల విలువలు, అర్థాలు పోగొట్టుకుని, ఒంటరి జీవి అయిపోతాడు. ఇక ఆ జీవితం అంతా నీరసమై పోతుంది.”

మొదటి వృద్ధుడు సిగ్గుతో, ఏమీ మాట్లాడ లేకపోయాడు.

 

మిత్రులారా, కుటుంబం ఉంటేనే జీవితంలో ప్రతి ఒక్క చిన్న పెద్ద సంతోషం, ఒక సంతోషంలాగా కనిపిస్తుంది.

ఇక కుటుంబమే లేకపోతే, మీ ఆనందం, బాధ ఎవరితో పంచుకుంటారు? కాస్త ఆలోచించండి!!

#నీతి : ఎవరికి_ఏం_అర్ధమయితే_అది

Previous post బంధం
Next post బంధం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *