లలాట లిఖితం

లలాట లిఖితం

సృష్టిచేసి, బ్రహ్మ, జీవరాసి, వ్రాయునట,
నుదుట ఈ జన్మలో ఎట్లుండ వలెనో,
ముందు జన్మ లెక్కలుచిత్ర గుప్తుని వద్ద సేకరించి.
విధాత రాసిన వ్రాత మార్చ ఎవరి తరమూ కాదట.

వాటి మంచిచెడుల చూడ సిద్ధముగ నుండు నట విష్ణువు.

ఈ జన్మలో చేసిన పాపపుణ్యముల
పట్టిక చేయు చిత్ర గుప్తుడు. రెండు జన్మల లెక్కలు విడి విడిగ,నాలుగు పట్టిక లుగా చేసి సమర్పించు నట యమునికి.

1) పాపములు ఎక్కువ ,పుణ్యములు తక్కువ చేసిన జీవులు.

2) పుణ్యములు ఎక్కువ,పాపములు తక్కువ చేసినజీవులు.

3) పాపములు మాత్రమే చేసిన జీవులు

4) పుణ్యములు మాత్రమే చేసిన జీవులు

యముడు రెండవ శ్రేణి వాటిని స్వయముగ తీసుకోని పోవ మొదటి మూడవ శ్రేణులవాటిని తన బటులచే తెప్పించునట.
(కొంత విన్నది కొంత ఊహించినది)

నాలుగవ శ్రేణి వాటిని లయకారుడు సతీ సమేతంగా తరలి వచ్చునట, ప్రశాంతంగా తనలోకమునకు తీసుకోనిపోవ(సేకరణ కాశీ ఖండం నించి, కాశీలో శివైక్యం పొందిన వాటి గూర్చి)

సృష్టి, స్థితిలయలు నిరంతరంగా ఎల్లపుడు జరుగుతుండునిటుల, విధి వ్రాసిన వ్రాత,సృష్టి,రహస్యమెరిగినవారెందరుందురు?

– రమణ బొమ్మకంటి 

Related Posts