లంగరెత్తుదాం
ఉక్కపోత బంధనాలను ఛేదించి
మనిషిని ఆలింగనం చేసుకోవాలి
మానవత్వానికి ఊపిరులూది
జీవుడే దైవమని చాటాలి!
మూఢనమ్మకాల గోడలను పెకలించి
మూకమనస్తత్వాలను బానిస ధోరణులను
సంస్కారయజ్ఞంలో సమిధలను చేసి
నూతన సమాజానికి పునాదులేద్దాం!
జీవిత పాఠాన్ని నెమరేసి
ముసురు మబ్బును తొలగించి
చిగురించే వేకువలో
వినిపించే రాగమై లంగరెత్తుదాం!
– సి. యస్. రాంబాబు