లాక్ డౌన్ కాలాన

లాక్ డౌన్ కాలాన

 

కరోనా
ప్రపంచాన్నే
ఇంట్లోకి తరిమితే
వంటింటికి అతుకబడి
హింసలన్నింటిని
బిగి పంటిన భరించావ్

భుజాలపై
కుటుంబ భారంతో
వేల కిలోమీటర్లు
రక్తాలు కారంగ నడిచావ్

దిక్కు తోచక
ఒంటి నమ్ముకొని
ఇంటి
ఆకలిని తీర్చావ్

విశ్వమంతా
విశ్రాంతి తీసుకున్నా
విశ్రమించక శ్రమించావ్

ఈ జగాన
నిన్ను మించిన
యోధులెవ్వరే…తల్లి

– అమృతరాజ్

(లాక్ డౌన్ కాలంలో పీడిత మహిళల పరిస్థితులు)

Related Posts

1 Comment

  1. మహిళకు ఎప్పుడూ విశ్రాంతి లేదని బాగా వివరించారు.. ధన్యవాదాలు 🙏

Comments are closed.