మా ధ్యేయం!

మా ధ్యేయం!

 

హయ్! నేను చీకటి. నేనంటే మీకు

భయం. వెలుగంటే నాకు భయం. నా సంచారం

రాత్రి. దానిసంచారం పగలు. సూర్యుడు నా

విరోధి. చంద్రుడు సూర్యుని స్నేహితుడే. కానీ

నాకు అంత విరోధి కాడు.                

అమావాస్యనాడు అయిపు లేకుండా పోతాడు.

పౌర్ణమికి చల్లటి పార్టీ ఇస్తాడు.              

మా ఇద్దరి స్నేహం మీకు. చల్లటి బ్లాక్ కాఫీ

అనుభూతి.                                               

వెలుగుకి నాకు చుక్కెదురు. దాని పరిధి దాటితేనే

నాకు ఉపాధి. అయినా మేము ప్రాణ

స్నేహితులం. చెట్టపట్టాలేసుకుని తిరుగుతూ

ఉంటాం. మీరు చేసిన దీపాలు కొన్ని నాలో

వెలిగిస్తారు.దానికి నాకు పోట్లాట పెడుతూ

ఉంటారు. కొంతదూరం అవి నన్ను

తరిమికొడతాయి . అయినా   మీమీద ప్రేమతో

నేను మౌనంగా ఉంటా. మీ కనురెప్పలు నాకు

ముసుగులు. మీరు రెప్పలు మూస్తే నేనే.             

నాలో వెలుగు ఉంది. కా‌‍‌ని దానిలో నేను లేను.

ఇది మా ఇద్దరికీ తెలుసు. పైకి అట్లా

ఉంటాం ఇది పరమ రహస్యం.                      

కొంతమందికే తెలుస్తుంది.                

నాలో వెలుగు చూడటానికి కొందరు కళ్ళు

మూసుకుంటారు. నాతో మీకు స్నేహం, కలుగు

వెలుతురుతో పరిచయం

సృష్టి లో నాది ముఖ్యపాత్ర. బ్రహ్మ సృష్టికి నేను

స్థావరం.  ఆయన ఆస్తి బ్రహ్మపదార్థం. దానికి

నేను కాపలా.

అది నా అదృష్టం. అందుకే నేను ఎవరిని రానివ్వను .

ఆస్తిని నేను కంటికి రెప్పలా కాపాడుతూ

ఉంటాను. కొంతమంది నా కళ్ళు కప్పి

జారుకుంటూ ఉంటారు. నేను ఎంత కమ్ముకొని

చిమ్మచీకటి సృష్టించినా వదలరు. వారి జ్ఞాన

నేత్రాలతో చూసి బ్రహ్మ ని కలవ గలుగుతారు.

ఆయన ఇచ్చిన జ్ఞాన సంపద తీసుకుపోతారు. ‌

నాకు ఓటమి తప్పదు.బ్రహ్మ నన్ను ‌చూసి

చిరునవ్వునవ్వుతాడు, ‌ఏమీ అనడు.                

ఆయనఆస్తి ఆయనిష్టం.నేనునూ ఒక చిరునవ్వు

పడేసి మౌనంగా ఉంటాను.

‌నా ధ్యేయం అంధకారం. వెలుగు ధ్యేయం కాంతి. ‌    
మాఉమ్మడి ధ్యేయం.           

ప్రపంచాన్నిశాసించటం. ‌

– రమణ బొమ్మకంటి

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *