మా నాన్నే నా హీరో

మా నాన్నే నా హీరో

మా నాన్నే నా హీరో

చాలా మంది సినిమా హీరోలను ఆరాధిస్తారు. వారినే హీరోలుగా భావిస్తారు. నాకు మాత్రం నాన్నే హీరో. మా నాన్న పేరు చలసాని వెంకట రామకృష్ణ గారు. ఆయనప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగాపని చేసి రిటైర్ అయ్యారు.అందరికీ అమ్మ తొలి గురువుఅయితే నాకు మాత్రం నాన్నేతొలిగురువు. విద్యాబుద్ధులుచెప్పటంతో పాటు సమాజంలోఎలా మసలాలో నేర్పించిన మహా మనిషి ఆయనే. ఆయనతన స్వంత డబ్బుతో ఎందరికోచదువు చెప్పించారు. తన జీతం మొత్తం డబ్బు అవసరం ఉన్న వారికి ఇచ్చేవారు. మాఅమ్మగారు కూడా ఉద్యోగంచేస్తుండటం వలన ఆమెజీతం మా కుటుంబానికివాడేవారు. కష్టాలను ఎలాఎదుర్కోవాలి, సమస్యలుఎలా తీర్చుకోవాలి అనేవి ఆయన జీవితం చూసి మాకు
తెలిసింది.

టీచర్స్ గిల్డ్ లోకూడా ఆయన పనిచేసేవారు.ఆయన నిస్వార్థంగా ఏ పనైనాచేసేవారు. రిటైర్ అయ్యాక కూడా ప్రైవేటు స్కూలులోపనిచేసారు. చివరకు ఆయనగుండెపోటుతో మరణించారు.ఆయన చనిపోయేనాటికి ఆయన బ్యాంకు ఎంకౌంట్లోకరెక్టుగా వంద రూపాయలుమాత్రమే ఉన్నాయి. ఏదిఏమైనా నా హీరో నాన్నే.వారి మంచితనమే నన్ను నా కుటుంబాన్ని కాపాడుతోంది.

 

-వెంకట భానుప్రసాద్ చలసాని

సమాజం లో జరిగే అన్యాయాలు Previous post సమాజం లో జరిగే అన్యాయాలు
సినారె Next post సినారె

One thought on “మా నాన్నే నా హీరో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *