మా ఊరి సంక్రాంతి

మా ఊరి సంక్రాంతి

మాది ఆంధ్ర ప్రతి సంవత్సరం మేము ఊరు వెళ్ళాతాము.. భోగి ముందు రోజు రాత్రి అందరూ మగవాళ్ళు భోగిమంటలు కోసం ఏర్పాట్లు చేశారు.. తెల్లవారుజామున భోగిమంటలు వేస్తారు. అందరూ కుటుంబంతో భోగిమంటలు దగ్గరకు వెళ్తాము.

తర్వాత గుడికి వెళ్లి వస్తాను రేపటి కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తాము. ఇంట్లో ఉన్న అందరికీ కొత్తబట్టలు  తీసుకుంటాము. తరువాత రోజు సంక్రాంతి పండుగ సందర్భంగా అందరం తెల్లవరుజామున లేచి సాన్నం చేయడానికి చెరువుకి వెళ్లి వస్తాము.

దారిలో ఒక పక్కకి తులసి మొక్క ఉంటుంది. ఒక బిందేతో నీళ్లు తీసుకొని వచ్చి ఆ తులసి మొక్కకు పోస్తాము. ఇంటికి వచ్చి పూజకి అన్నీ ఏర్పాట్లు చేసి పూజ చేస్తాము.

దేవుడు దగ్గర కింద మా పెద్ద వాళ్ళ ఫోటోలు (పెద్ద వాళ్ళు అంటే మా నాయనమ్మ, తాతయ్య వాళ్ళ ఫోటోలు) పెట్టి దీపం పెడతాము. 

ముందు ఆకులు పెట్టి బెల్లం అన్నం, వంకాయ, కందులు కలిపి  ఒక కూర, అనపగింజలు, గుమ్మడి, ఎర్ర దుంపలు కలిపి మరో కూర, అన్నం, చారు, పప్పు, గారెలు, బూరెలు ఇవి అన్నీ పెడతాము… 

ఆ పక్కనే నీళ్లతో ఉన్న బిందె పెట్టతాము. దాని మీద ప్లేట్ పెట్టి కొత్త బట్టలకు పసుపు రాసి ఆ ప్లేట్లో పెట్టతాము.. తరువాత  ముత్తయిదువులకు వాయినాలు ఇస్తారు.

కాసేపు కూర్చున్న తరువాత ఇంటి పెద్ద ఆకుతో ఉన్న భోజనాన్ని మరొక చేతులో  చెంబుతో నీళ్ళు మేడ మీదకి తీసుకొని వెళతారు.. రెండు గంటలు తరువాత ఇంటిలో ఉన్న వాళ్ళందరూ ఆ ఆకులో ఉన్న భోజనం చేస్తారు..

ఆ భోజనం చేసినప్పుడికి మధ్యాహ్నం అవుతుంది.. తరువాత పండగ పూర్తి అయిపోయింది. మరుసటి రోజు కనుమ ఉదయం పశువులకు పూజ చేసి అమ్మవారి గుడికి వెళ్లి వస్తాను అంతే…

ఈవెనింగ్ సినిమా కి వెళ్ళడం లేదా ఊరికే ఇంటిలోనే ఉండడం అంతే….

-మాధవి కాళ్ళ

Related Posts

1 Comment

Comments are closed.