మా తప్పా?

మా తప్పా?

స్త్రీత్వంమంతా నలుగుతుంది

మగాళ్లనే మృగాలకిందా

అరవిరిసిన పూలతో

పోలుస్తారే మమ్ము ఇందుకేనా?

స్వాతంత్ర స్వర్ణోత్సవాలు జరుగుతున్నవేళ,

మాబాల్యం, యవ్వనం మగాళ్ల కామకాటుకు బలి కావాల్సిందేనా!

మత్తులో గమ్మత్తు అనుకునే కోడెకారు కుర్రాళ్ళు,

వయస్సుతో నిమిత్తంలేదు, వావి వరుసలు అసలే లేవు

ఆడది అయితే చాలు అని చూస్తూ ఉన్నరే.

ఏమిటి మా ఖర్మ, ఖర్మభూమిలో పుట్టడమే మాతప్పా,

– పోరండ్ల సుధాకర్

Related Posts