మా ఊరి గోదావరి

మా ఊరి గోదావరి

మా ఊరి గోదావరి

అది నా పెళ్లైన కొత్త మా అత్తగారి ఊరు నస్పూరు..ఆ ఊర్లోకి వెళ్తుంటె ఒక పక్కన వాగు మరో పక్కన చెఋవు మధ్యలో రోడ్డు చూడడానికి చాలా బాగుంటుంది అలా రోడ్డు మీద నుండి మా ఇంటికి చేరాక చూస్తే ఇంటి వెనకాల గల గల పారే గోదావరి ..ఇరు పక్కల పచ్చని పంట పొలాలు తాటి చెట్లతో అందమైనప్రకృతి అందాలు అవన్నీ దాటగానే రా రమ్మని పిలిచే గోదారమ్మ తల్లి వీచే గాలికి ఆ పారే నీటి సవ్వడితో ఆ అందమైనతల్లి గోదారి తల్లి స్వఛ్చమయిన నీళ్లు ఎంత బాగుండేవో!

ప్రతి పండుగకు తిథులకు మేం గోదావరికి వెళ్లాల్సిందే!గోదారి స్నానాలు పూజలు అదో అధ్బుతమైన జ్ఞాపకాలు..మనసుకు హత్తుకునే సంఘటనలు…ఆ గోదావరి వల్లనే మా ఇంటి బావిలో కూడా తియ్యటి నీళ్లు చెంబుతో ముంచుకునేలా పైనే ఉండేవి..ఆ రోజులే ఎంతో బాగుండేవి..

ఆ ఊరిలో మా ముగ్గురు మామయ్యల కుటుంబాలే గొప్పగా ఉండేవి మా పెద్ద మామయ్య కొడుకే ఆ ఊరికి ముఫ్పై ఏళ్లు సర్పంచ్ గా ఉన్నారు..ఇది రాస్తుంటెఅప్పటి వైభవం కళ్లకు కట్టినట్టే కనిపిస్తుంది..అదండి మా గోదావరి ఊరి సంగతి..

అంతే కాదండి అసలు రాయాలనుకున్నది మర్చిపోయాను..అయితే మా ఊరి చుట్టూ ఉన్న ఈ నీళ్లన్ని 1982 లో చుట్టూ వచ్చాయి ఆ నీళ్లల్లో మా ఊరు ద్వీపంలా నిలిచింది..
ఊరిలోకి రాకపోకలు బంద్ అయ్యాయిమా వాళ్లందరూ భయపడి పోయారు..మేమంతా గోదారమ్మకు పూజలు చేయడం కొబ్బరి కాయలు కొట్టడం చేసాం! మూడు రోజులకు శాంతించింది..

అదండి సంగతి…ఇది రాయాలనుకుని మర్చిపోయా! అందుకే మళ్లీ రాసా! ఏమనుకోకండి ఫ్రెండ్స్..

-ఉమాదేవి ఎర్రం

చిలిపిలిపి Previous post చిలిపి లిపి
యజ్ఞవాటికలో మౌనమై Next post యజ్ఞవాటికలో మౌనమై

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *