మానవ జన్మ

మానవ జన్మ

అన్ని జీవులలో ఉత్కృష్టమైనది మానవ జన్మ భగవంతుని
సృష్టి రహస్యం మూలం ఎవ్వరికి ఇప్పటికీ ఎప్పటికీ
తెలుసుకోలేనిదిగామిగిలినది అనంత శక్తి క్షేత్రంలో
మానవుడి యొక్క పుట్టుక
సార్థకత జన్మరాహిత్యం ఏమిటి అనేది అంతు చిక్కని ప్రశ్న.

పూర్వ జన్మల కర్మానుసారంగా మానన జన్మరూపకల్పనజరుగుతుంది అని అంటారు.
గర్భస్థ శిశువు నుండి మొదలు మానవుడు అన్ని
దశలలో తన చిత్తంతో తనే
యుద్దం చేస్తూ కర్తవ్యాన్ని
కర్మలకు అనుగుణంగా చేస్తూ వుంటారు.
మానవ జన్మ మామకారాల
చట్రంలో బందీగా మారి
సుఖ దుఃఖాలు , కామ క్రోధాలు, కోరికలు, సంసార
సుఖాలు,భాధలు, బంధాల
పరంపరం లో కొట్టుమిట్టాడతుంటారు

కాని మానవ జన్మ సార్థకత
చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన భగవంతుడు ఆశ, కోరికల మధ్యన ఆలోచన,
విచక్షణ అనే స్థితులను
కల్పించాడు

మాట్లాడే శక్తి, ఆలోచించే
బుద్ధి, తెలుసు కోవాల్సిన
జ్ఞానం, మానవునికి మాత్రమే ఇచ్చాడు.
ఈర్ష్య, అసూయ ద్వేషాలు అనే వాటితో మానవుని
జీవన విధానాన్ని మారుస్తున్నాయి
సౌక్యాల కోసం విలువలు
పాటించకుండా ఆత్మ జ్ఞానం అవగాహన మానవుడికి రావడంలేదు
సృష్టికర్తఅయినభగవంతుని
అద్భుతం గా మానవ జన్మ
ప్రసాదాన్ని జీవనపరమార్థం
జీవితసత్యాలనుతెలుసుకుని జనన మరణాలు తప్పని
సృష్టిలో సీద తీరాలి
ఈప్రపంచంలో అందరు…?

– జి జయ

Related Posts