మారని కాలం
కాలం.. కాలం
భూత కాలం
వర్తమానకాలం
భవిష్యత్ కాలం
భూత కాలం మరిచిపో..
వర్త మానంలోజీవించు
భవిష్యత్తు పై ఆశలు పెంచుకో
భవిష్యత్తుకి వర్తమానమే
సోపానంగా కష్టించు
కాలం మారుతుంది
గతం గాయాలు మాన్పుతుంది
రెట్టించిన ఉత్సాహంతో
భవిష్యత్తుకి పునాది వెయ్యి
కాలానికి ఎదురీదు
కాలం నీ కెప్పుడు అనుకూలమే
కష్టాలకి అతీతులు
కారె వ్వరూ
కాలం మనుషుల్ని మార్చదు
మనుషుల అసలు నైజం
బయట పెడుతుంది
కాలం కలిసి రాలేదని
కలత చెంద కూడదు
– మోటూరి శాంతకుమారి