మారిన విలువలు

మారిన విలువలు

శాసించు మనిషిని
ఆకలి దప్పులు
జీవితాంతము అవి
వదలకవుండు

అవి తీర్చుకొన తాను
ఎత్తులు ఎత్తునెన్నో
పొట్ట నింపు కొననెపుడు
ఉరుకు పరుగుతొ నుండు

పొట్ట నిండివాని
హోదా పెరగ
దానితో పాటు
విలువమారు

డబ్బు హోదా పదవి
మార్చు చుండు విలువ
లేనపుడు విలువ
నిలువ లేకుండు

మంచి పనులు చేయ
పెరుగు విలువ
చెడు పనులు చేయ
తరుగు విలువ

మార్పు సహజమని
కాలము చెప్పు
మారుచుండు విలువలు
మనకు తోడుగ

– రమణ బొమ్మకంటి

Related Posts