మార్పు

మార్పు

ఎన్నో ఆశలతో… కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన నాకు… దేవుడు నిజంగానే… చాలా కొత్తగా నా జీవితాన్ని మలిచాడు అనిపించింది…. కానీ ఎన్నో ఒడుదుడుకులు ఎదురుకుంటూ… ఈ సంవత్సరాన్ని పూర్తి చేశాను

రోజులు చాలా అందంగా గడుస్తున్నాయి…. అలా నాలుగు నెలలు గడిచాయి… ఆరోజు నాకు ఇంకా చాలా బాగా గుర్తుంది… 

ఏప్రిల్ 30 ఆదివారం సాయంత్రం 3:10 గంటలు… 

నేను నా ఆఫీస్ వర్క్ ఉంది అని ఆరోజు ఆఫీస్ కి వెళ్ళాను….

ఆఫీస్ వర్క్ పూర్తి చేసి.. కాసేపు మా ఫ్రెండ్స్ తో సరదాగా కబుర్లు కాకరకాయలు చెప్పుకుంటున్నా… ఇంకా ఇంటికి వెళ్ళాలి అని వాళ్ళకి బై చెప్పి మెట్రో స్టేషన్ కి వెళ్లాను

మాదాపూర్ మెట్రో స్టేషన్:

నేను మెట్రో కోసం వెయిట్ చేస్తున్న… 3 గంటలకి మెట్రో వచ్చింది.. నేను మెట్రో ఎక్కి కూర్చున్నా.. నెక్స్ట్ స్టాప్ లో తను మెట్రో ఎక్కాడు… తనని చూడగానే తానే నా సోల్ మేట్ అనిపించింది…. తరువాత తను దిగాల్సిన స్టాప్ వచ్చింది తను దిగి వెళ్ళిపోయాడు…. కానీ నా మనసులో తనే ఉండిపోయాడు…. నేను తన ఆలోచనలతోనే ఇంటికి వెళ్లాను.. తనని మళ్ళీ చూస్తానా అనిపించింది… ఎందుకుంటే ఈ ఉరుకుల పరుగుల జీవితం కూడా మెట్రో లాగానే… టైమ్ వేగంగా గడిచిపోతుంది….

తరువాత తనకోసం రోజు మెట్రో లో చూసేదాన్ని… కనిపించేవాడు కాదు…. అల 3నెలలు గడిచాయి….. జూలై 21 మా తమ్ముడు పుట్టిన రోజు అని షాపింగ్ కి వెళ్లాను…. అక్కడ తను కనిపించి అంతలోనే మాయం అయిపోయాడు… నా భ్రమ అనుకుని షాపింగ్ పూర్తి చేసి ఇంటికి వెళ్లి ఫ్రెష్ అవుతుంటే తనని మొదటిసారి చూసిన రూపం కళ్లముందు మెదిలింది…. చాలా మంది అబ్బాయిలు నాకు ఫ్రెండ్స్ గా ఉన్నారు… ఎప్పుడు ఎవరి మీద రాని ఫీలింగ్ తన మీద వచ్చింది…. కానీ ఆ ఫీలింగ్ కూడా కొత్తగా ఉంది…. ఫ్రెష్ అయ్యి తమ్ముడుతో కేక్ కట్ చేయించి…. నిద్రపోయాను…

మరుసటి రోజు ఉదయం మళ్ళీ మెట్రోలో కనిపించాడు… ఈసారి ఛాన్స్ మిస్ చేసుకోకూడదు అనుకుని…. వెళ్లి తనతో మాట్లాడాను… తన మీద ఉన్న ఫీలింగ్ కొంచెం కొంచెం తనకి అర్థమయ్యేలా చెప్పాను… మళ్ళీ మిస్ అయిపోతాడెమో అని తన ఫోన్ నంబర్ కూడా తీసుకున్నా… నాకే ఆశ్చర్యం గా అనిపించింది. తనతో అల మాట్లాడి ఫోన్ నంబర్ తీసుకునే సరికి.

కానీ తప్పలేదు……. ఇంకా అలా తనని చూస్తూ మాట్లాడుతూ రోజులు గడిపేశాను….. కానీ సడెన్ గా తన ఫోన్ నంబర్ కలవలేదు… ఇన్నిరోజులు జరిగింది కల ఏమో అని భయపడ్డాను…. వారం రోజులు గడిచాయి… స్విచ్ ఆఫ్ అని వచ్చింది… తరువాత రోజు తను నాకోసం మా ఆఫీస్ కి వచ్చాడు…. తన ఫోన్ పోయింది అని కొత్త ఫోన్ తీసుకున్న అని చెప్పాడు.

ఇంకా ఇలానే ఉంటే కష్టం అని చెప్పి ప్రపోజ్ చేశా బట్ తను నన్ను ఫ్రెండ్ లాగా మాత్రమే అన్నాడు… గుండె ఆగిపోయి కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపించింది… ఆరోజు నుండి రాత్రి పూట సరిగా నిద్రపోవడం మానేశా… పూర్తిగా తన ఆలోచనల్లోనే బతికేసా…… ఇంకా తనకి ఎప్పుడూ ఎదురు పడకూడదు అనుకుని.. జాబ్ మారిపొయా….. కానీ నా నుండి తనని మాత్రం వేరు చేయలేకపోయాను….

కానీ ఈ సంవత్సరం… బాధలు,సంతోషాలు అన్ని ఇచ్చింది… తను రిజెక్ట్ చేసాడు అని… నన్ను నేను చాలా మార్చుకున్న.. ఇప్పుడు ఆ మార్పు నాకు చాలా బాగా నచ్చింది…

– మేఘమాల

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *