మార్పు మంచిదే

మార్పు మంచిదే

మార్పు మంచిదే

ప్రతి ఒక్కరూ తమ బ్రతుకు దారిని సరైన విధంగా మలచుకునే పనిలో ఉంటారు. అలాంటి వారిలో నా ఫ్రెండ్ ముని ఒకరు. అతనిపేరు ముని. కానీ మనిషి ముని టైప్ కాదు. చాలా రెబల్ గా ఉంటాడు. ఎప్పుడూ ఎవరో ఒకరితో కయ్యానికి కాలుదువ్వుతూ ఉండేవాడు. అట్లా అని మనిషి చెడ్డవాడు కాదు. ఎక్కడ అన్యాయం జరిగినా చూసి తట్టుకోలేక ఆ అన్యాయం చేసిన వారితో గొడవ పడుతుండేవాడు.

అదృష్టవశాత్తూ అతనిపై పోలీసు కేసులు లేవు. నువ్వు అన్ని విషయాలలోకి వెళ్ళవద్దు అని చెప్పినా వినే రకం కాదు. మునికి పెళ్ళి అయ్యింది. అంతే ముని ఒక మునిలా మారిపోయాడు. దానికి కారణం ఉందండోయ్. ఇంట్లో భార్యను సముదాయించేందుకే అతనికి సమయం సరిపోవడం లేదు. ఇక అతను బైటకు వెళ్ళటం తగ్గింది. బయటకు వెళ్ళకపోతే ఎవరితోనూ ఏ గొడవలు ఉండవు కదా. అదీ విషయం అన్నమాట.

ముని భార్య చాలా తెలివిగలది. భర్త ఎక్కువ సమయం బయటకు వెళ్ళకుండా ఏదో ఒక సంఘటన ఇంట్లోనే సృష్టిస్తుంది. తరచుగా అలగటం, లేకపోతే మునితో ఏదో చిన్న వాదులాట పెట్టుకుని అతనిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొన్నాళ్ళకు ముని కోరలు తీసివేసిన తాచు పాము లెక్క బుసలు కొట్టడం తప్ప గొడవ పడటం మానేసాడు. అతని జీవితం మారింది.

అతని బ్రతుకు దారి బాగయింది. నాకైతే అతని జీవితంలో జరిగిన మార్పు అతనికి మంచిదే అనిపిస్తుంది.

– వెంకట భానుప్రసాద్ చలసాని

బ్రతుకు మాట - బంగారు పూల బాట Previous post బ్రతుకు మాట – బంగారు పూల బాట
స్మృతుల సంఘీభావంతో...!!! Next post స్మృతుల సంఘీభావంతో…!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close