మార్పు నిత్య నూతనం

మార్పు నిత్య నూతనం

జీవ కణాలు వింతగా చూస్తూ
వెన్న లా కరిగి
సెలయేటి గల గలలు చేస్తూ
ముందా వెనుకా తెలియని
కాలాన్ని…
లెక్కించే మనసులా
మెల్లగా జారుకుంటుంటే
ఆశ పడే…..
అదే మనసు ఆగుతుందా!!!
వెలుగు వసంతాలను ఊరిస్తూ
కొత్త సంవత్సరం
సుఖ సంతోషాలకు దారి
చూపిస్తూ
శ్వాస ఒక ప్రభంజనంలా
నిశ్వాస ఒక ప్రకంపనంలా
పదండి ముందుకు……
పదండి ముందుకు అంటూ
ప్రత్యుష ప్రశాంత
వెలుగుల్లో….
కొంగ్రొత్త వెలుగుల్లోకి …..
పిలుస్తుంది
నూతన సంవత్సరం
2023
పెద్దలకు, పూజ్యులు
పిల్లలు, స్నేహితులు మరియు
అందరికి పేరు పేరున
హృదయ పూర్వక
శుభాకాంక్షలు.

– అల్లావుద్దీన్

Related Posts