మాతృభాష

మాతృభాష

మాతృభాష గొప్పతనం
మనం తెలుసుకోవాలి
మరోభాష నేర్చునపుడు
మనకెంతో సాయపడు. //మాతృ//

1. పాఠాలను వినుట గొప్ప
   కళగా భావించాలి
   సంభాషించే టప్పుడు
   చాతుర్యం చూపాలి
   అర్థగోచరమ్మగుటకు
   హావభావముండాలి
   విరామ చిహ్నాలను
   తప్పక పాటించాలి //మాతృ//

2) స్వరభేదము ననుసరించి
   సంభాషణ ఉండాలి
   శ్లేషార్థాలను వాడుతు
   హాస్యము పుట్టించాలి
   సంభాషణలోన పెక్కు
   సామెతలను వాడాలి
   నుడికారపు సమాసాల
   చాటు సొగసులుండాలి //మాతృ//

3) పద్యాలను చదువుతుంటె
   హృద్యంగా ఉండాలి
   అర్థ భావ రాగాలను
   అన్వయించి చదవాలి
   హ్రస్వ.దీర్గ.ఒత్తు.సున్న
   గీత.పొల్లు పోరాదు
   అర్థము లేని చదువులు
   వ్యర్థమని తెలియాలి //మాతృ//

4) విన్నపదము శబ్ధములో
   గూఢార్థం తెలియాలి
   పర్యాయ పదాలన్ని
   పట్టుదలతొ నేర్వాలి
   ముత్యాలను కూర్చినట్లు
   ముచ్చటైన మనభాషను
   అక్షర దోషమ్ము లేక
   అందంగా రాయాలి //మాతృ//

– కోట

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress