మాతృభాష

మాతృభాష

మాతృభాష,

అమ్మ అనే పిలుపును ,

అందులో ఆత్మీయతను నింపుకున్న భాష.

మాతృభాష ఎవరికోసమో నేర్చుకునేది కాదు.

పెరిగి పెద్దయ్యాక నేర్పేది కాదు.

మాతృభూమికి  మనం ఇచ్చే
భావ సంపద.

మాతృమూర్తికి అందించే
అమూల్యమైన బహుమతి.

భాషలు ఎన్నో వున్నాయి.
భాషలు ఎన్నో నేర్చుకోవచ్చు.

కానీ, మాతృభాషను మాత్రం

చివరివరకు గుర్తుపెట్టుకోవాలి.

అమ్మను వదిలేసినా ,

మాతృభాషను మర్చిపోయినా

మనిషి అనాథ బత్రుకు బతుకుతునట్టు.

– రాధికా.బడేటి

Related Posts