మాతృమూర్తులు

మాతృమూర్తులు

భగవంతుడు ఎన్నో శక్తులతో
మనిషిని చేయగా అ మనిషి నుంచే
మరో ప్రాణం కి ఆయువు పోసిన
పుణ్యమూర్తి అ భగవంతుని కన్నా మిన్న. 

నీకు సుఖము అందించి నీ రెండు చుక్కల
కారణం గా నవ మాసాలు తనకు
మించిన బరువుని ప్రాణం పెట్టి
కాపాడుతూ ప్రాణం వదిలి అయినా
మరో ప్రాణంకి జీవం పొసే అద్భుత అవని.

చులకనగా చూడక మనస్సు
పెట్టి గౌరవించు, మనస్పూర్తి గా ప్రేమించు,
మలినం లేకుండా అభిమానించు.

నీ ఆకలి తీర్చే అమృతమూర్తి
నీ కోపాన్ని కరిగించే కరుణామూర్తి
నీ బాధ తీర్చే మాతృమూర్తి

భువికి మించిన సహనం కలిగిన
మాతృమూర్తులు అందరికి మీకు పాదాభివందనములు

 

– సూర్యక్షరాలు

Related Posts