మావూరి పాఠశాల

మావూరి పాఠశాల

పిలిచింది పిలిచింది
మన పాఠశాల మన పాఠశాల

మనందరినీ మరొక్కసారి
మనసారా కలుసుకోమని

అద్భుత అవకాశం
ఇది మన ఆత్మీయ సమ్మేళనం

అక్షరాల అనుబంధమై
మరువలేని మధుర జ్ఞాపకాలు

జన్మనిచ్చిన ఊరిలో
జ్ఞాన మిచ్చిన బడిలో

విలువలు నేర్పిన గురువులు
దారిచూపిన అక్షర జ్యోతి

చెరిగి పోని స్నేహ బంధం
అనుభూతుల అంతరంగం

చదువులమ్మసంస్కారము
గతమైనా భవితైనా

అండ దండలై నిలిచేది
మనబడిలో నేర్చిన అడుగులు

పరవశించే హృదయంలో
పరితపించే మమకారం

తీపి గుర్తుల ఉత్సాహం
వెల్లివిరిసెను సంతోషం

చీకటి వెలుగుల జీవితాన
చిన్ని ఆశల ఆనందం

పిలిచింది పిలిచింది
మన పాఠశాల మన పాఠశాల

మనందరినీ మరొక్కసారి
మనసారా కలుసుకోమని …?

– జి జయ

Related Posts